షియోమీ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కీలక వివరాలు లీక్.. టైటానియం ఫ్రేమ్ సహా కీలక స్పెసిఫికేషన్లు..!
షియోమీ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Xiaomi 14 సిరీస్‌ను ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా షియోమీ 14 మరియు షియోమీ 14 ప్రో తోపాటు షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కానుంది. అయితే ఈ అల్ట్రా మోడల్‌పై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అదే చైనాలో షియోమీ 14 ప్రో స్పెషల్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ టైటానియం ఫ్రేమ్ సహా వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్రో మోడల్ తరహా ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు EMVCo వెబ్‌సైట్‌లో ఈ షియోమీ 14 ను గుర్తించారు.

91మొబైల్స్ నివేదిక ప్రకారం.. షియోమీ 14 అల్ట్రా మోడల్‌ను (Xiaomi 14 Ultra) టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే మిగిలిన మోడళ్లు కూడా మెటల్ ఫ్రేమ్‌లతో రానున్నాయి. ఆపిల్ మరియు శాంసంగ్ ఇప్పటికే టైటానియం ఫ్రేమ్‌లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో మోడల్ మరియు శాంసంగ్ S24 అల్ట్రా మోడల్ ఇప్పటికే టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి.
షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ చైనాలో 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్ +512GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్+ 1TB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు షియోమీ 14 గ్లోబల్ వేరియంట్ EMVCo సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత hyperOS 1.0 పైన పనిచేస్తుంది.
షియోమీ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఫిబ్రవరి 25న ఈ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. షియోమీ 14 మరియు షియోమీ 14 ప్రో తోపాటు షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కానుంది. షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ అడెన్నో 750 GPUతో జతచేయబడుతుందని భావిస్తున్నారు. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 HyperOS పైన పనిచేయనుంది.
దీంతోపాటు షియోమీ 14 అల్ట్రా హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. వెనుకవైపు క్వాడ్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT-900 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90W వైరడ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5180mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.
అదే షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ కూడా OS మరియు చిప్‌సెట్‌లో ప్రో మోడల్ తరహా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే 6.36 అంగుళాల LTPO అమోలెడ్ 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 90W వైరడ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4,610mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే బేస్, ప్రో మోడళ్లు.. Leica బ్రాండెడ్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 50MP టెలీఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 32MP అమర్చినట్లు తెలుస్తోంది.
చైనాలో ఈ షియోమీ 14 మరియు 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3999 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.50000 గా ఉంటుంది. అదే ప్రో మోడల్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ CNY 4999 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.56,500 గా ఉంది.


Click it and Unblock the Notifications








