Home
Mobile

షియోమీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. షియోమీ 15, 15 అల్ట్రా రిలీజ్ డేట్ ఫిక్స్.. వీటి ఫీచర్లు ఇవే...

Xiaomi 15: షియోమీ కంపెనీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ల సిరీస్‌ను లాంచ్ చేయడానికి రెడీ అయిపోయింది. షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా మోడల్స్‌తో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025లో బార్సిలోనా వేదికగా మార్చి 2న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది. ఈ గ్లోబల్ లాంచ్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో భారీ అంచనాలు పెంచేసింది. అయితే, ఇండియాలో ఎప్పుడొస్తాయి, ధర ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా మోడల్స్‌ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ధరలు ఎంత వంటి వివరాలు అన్నీ లీక్ చేసేశారు. ఆయన ప్రకారం, షియోమీ కంపెనీ మార్చి 18న ఇండియాలో ధరలు అనౌన్స్ చేస్తుంది, అంతేకాదు, మార్చి 21 నుంచి అమ్మకాలు కూడా మొదలైపోతాయి.

Xiaomi 15 and 15 Ultra to Hit Stores on March 18  What to Expect from These Flagship Phones

* షియోమీ 15 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

షియోమీ 15 అల్ట్రా ఫోన్ గీక్‌బెంచ్ AI టెస్టింగ్‌లో ఆండ్రాయిడ్ 15తో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది, 16GB RAM కూడా ఉండటంతో పర్ఫార్మెన్స్ విషయంలో తిరుగుండదు. ఫొటోగ్రఫీ లవర్స్‌కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు.

* వెనుకవైపు నాలుగు కెమెరాలు..

మెయిన్ కెమెరా ఏకంగా 50-మెగాపిక్సెల్ సోనీ LYT-900 సెన్సార్ ఇచ్చారు. దీనికి తోడు శామ్‌సంగ్ ISOCELL JN5 అల్ట్రా-వైడ్ లెన్స్, సోనీ IMX858 టెలిఫొటో సెన్సార్, ఇంకా ఆప్టికల్ జూమ్‌తో శామ్‌సంగ్ ISOCELL HP9 సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ కెమెరాల కాంబినేషన్‌తో ఫోటోలు, వీడియోలు అదిరిపోతాయి.

షియోమీ 15 Ultra ఫోన్ మరీంత స్ట్రాంగ్‌గా ఉంటుందట. IP68 + IP69 రేటింగ్స్‌తో వస్తోంది, అంటే దుమ్ము, నీళ్లు ఏమీ చేయలేవు. చైనాలో ఈ ఫోన్ కోసం ముందస్తు ఆర్డర్లు కూడా మొదలైపోయాయి, Mi మాల్‌లో బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 26న చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

* షియోమీ 15 ఫీచర్లు..

షియోమీ 15 స్టాండర్డ్ మోడల్‌ని గత అక్టోబర్‌లోనే చైనాలో రిలీజ్ చేశారు, షియోమీ 15 ప్రో మోడల్ మాత్రం చైనాకి మాత్రమే పరిమితం చేశారు. షియోమీ 15 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ప్రాసెసర్‌తో వస్తుంది. 6.36-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది, అది కూడా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి, వాటిని లీకా కంపెనీ ట్యూన్ చేసింది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్. అల్ట్రా మోడల్ లాగే, దీనికి కూడా IP68 రేటింగ్ ఉంది, అంటే దుమ్ము, నీళ్ల నుంచి పూర్తిస్థాయిలో సేఫ్టీ ఉంటుంది. దీన్ని ఎవరైనా రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు.

* ఇండియాలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్..

ఇండియాలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. CMR రిపోర్ట్ ప్రకారం, ఈ సెగ్మెంట్ 2024లో ఏకంగా 36% వృద్ధిని సాధించింది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే, షియోమీ 15 సిరీస్‌కి ఇండియాలో కూడా భారీగా ఫ్యాన్స్ ఉంటారని చెప్పొచ్చు. షియోమీ ఫోన్ల ధరలు ఇంచుమించు లక్ష రూపాయలు ఉండొచ్చు.

* షియోమీ 15 సిరీస్ నెక్స్ట్ ఏంటి?

అధికారికంగా గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్ అయిపోయింది, షియోమీ 15 అల్ట్రా డిజైన్ లీకులు కూడా ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తున్నాయి. షియోమీ ఇండియా కూడా కొత్త సిరీస్ లాంచ్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది. అనౌన్స్‌మెంట్ డేట్ దగ్గర పడుతుండటంతో, టెక్ లవర్స్ ధరలు, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనే విషయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 15 and 15 Ultra launch globally March 2nd, India prices March 18th, sales March 21st. Ultra features Snapdragon 8 Elite, 50MP quad camera, IP68 rating. India premium market growing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X