200MP కెమెరా, 5410mAh బ్యాటరీ, 6.73 అంగుళాల డిస్‌ప్లే ఫోన్ సేల్.. గరిష్ఠంగా రూ.10000 డిస్కౌంట్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi india) గత నెల రెండో వారంలో షియోమీ 15 సిరీస్‌ను (Xiaomi 15 Series sale in india) లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌ల సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈ ఫోన్ లు అనేక బెస్ట్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లను కలిగి ఉన్నాయి. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉన్నాయి. ఈ సిరీస్ Leica భాగస్వామ్యంతో బెస్ట్ కెమెరాలను కలిగి ఉంది. మరియు డిజైన్ పరంగాను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ పూర్తి ఫీచర్‌లు, సేల్ వివరాలు.
* షియోమీ 15 స్మార్ట్ ఫోన్, షియోమీ 15 అల్ట్రా వేరియంట్ ధర, సేల్ వివరాలు :
షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64999 గా ఉంది. ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుతో రూ.5000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, వైట్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

షియోమీ 15 అల్ట్రా మోడల్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,09,999 గా ఉంది. ఈ ఫోన్ సిల్వర్ క్రోమ్ రంగుల్లో అందుబాటులో ఉంది. షియోమీ 15 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్ లెజెండ్ ఎడిషన్ ధర రూ.11999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1500 డిస్కౌంట్ ను పొందవచ్చు.
ఈ రెండు ఫోన్‌లు షియోమీ ఇండియా ఇ-స్టోర్, ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon), ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
* షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ :
షియోమీ 15 (Xiaomi 15 Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.36 అంగుళాల FHD+ LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్ సపోర్టు, ట్రిపుల్ TUV Rheinland Eye ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది.
చిప్‌సెట్ వివరాలు :
ఈ షియోమీ హ్యాండ్ సెట్ శక్తివంతమైన క్వాల్‌కామ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS 2.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందనుంది.

కెమెరాలు, బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్ Leica కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టును కలిగి ఉంది. 50MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు OIS, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50MP టెలిఫోటోతో అందుబాటులోకి వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 90W వైర్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5240mAh బ్యాటరీని కలిగి ఉంది.
* షియోమీ 15 అల్ట్రా :
షియోమీ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ( Xiaomi 15 Ultra Smartphone ) 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.73 అంగుళాల LTPO అమోలెడ్ 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ మరియు డాల్బీ విజన్ ను సపోర్టు చేస్తుంది. షియోమీ షీల్డ్ గ్లాస్ 2.0 రక్షణ, ట్రిపుల్ TUV Rheinland సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
ఈ అల్ట్రా మోడల్ కూడా Leica భాగస్వా్మ్యంతో క్వాడ్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP LYT 900 ప్రైమరీ కెమరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు OIS, 3x ఆప్టికల్ జూమ్ తో 50MP సోనీ IMX858 టెలిఫోటో కెమెరా, OIS, 4.3x ఆప్టికల్ జూమ్‌తో 200MP ISOCELL HP9 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ను అమర్చారు. మరియు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

శక్తివంతమైన చిప్‌సెట్ :
ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS 2.0 ను కలిగి ఉంది. 90W వైర్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5410mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్ డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ పొందనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ సిరీస్ గూగుల్ జెమిని AI, AI రైటింగ్, AI సెర్చ్, AI గెశ్చర్స్ రియాక్షన్ వంటి ఫీచర్ లను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా అందుబాటులోకి వచ్చింది. 5G, 4G LTE, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు.
బెస్ట్ కెమెరాలు, ప్రీమియం డిజైన్, బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి షియోమీ 15 సిరీస్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో వివిధ సంస్థలు ప్రీమియం సెగ్మెంట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.


Click it and Unblock the Notifications





