Home
Mobile

లక్ష రూపాయల ఫోన్‌ను విడుదల చేసిన షియోమీ.. 200MP కెమెరా, 5410mAh బ్యాటరీ, 6.73 అంగుళాల డిస్‌ప్లే..!

షియోమీ 15 సిరీస్‌ (Xiaomi 15 Series) ఇవాళ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఇందులో భాగంగా షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అల్ట్రా వేరియంట్‌ ప్రీమియం మోడల్‌గా (Xiaomi 15 Ultra Smartphone Launched in india) లాంచ్‌ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌ చైనాలో అందుబాటులోకి వచ్చింది. ఈ అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ 200MP పెరిస్కోప్‌ లెన్స్‌, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది.

షియోమీ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ (Xiaomi 15 Ultra Smartphone) 6.73 అంగుళాల (1440*3200 పిక్సల్స్‌) LTPO అమోలెడ్‌ 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్ రేట్, 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ మరియు డాల్బీ విజన్‌ వంటి ఫీచర్‌లున్నాయి.

Xiaomi 15 Ultra Smartphone camera

ఈ అల్ట్రా మోడల్‌ వేరియంట్‌ షియోమీ షీల్డ్‌ గ్లాస్‌ 2.0 రక్షణ కలిగి ఉంటుంది. మరియు ట్రిపుల్‌ TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 16GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Xiaomi 15 Ultra Smartphone camera

కెమెరా విభాగం పరంగా అత్యంత నాణ్యమైన కెమెరాలను అమర్చారు. ఇందుకోసం Leica తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. వెనుక వైపు క్వాడ్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP LYT 900 కెమెరాను కలిగి ఉంది.

దీంతోపాటు 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, OIS, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP సోనీ IMX858 టెలిఫోటో కెమెరా మరియు OIS, 4.3x ఆప్టికల్‌ జూమ్‌తో 200MP ISOCELL HP9 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాతో విడుదల అయింది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

Xiaomi 15 Ultra Smartphone camera

కనెక్టివిటీ పరంగా 5G. 4G LTE, బ్లూటూత్, వైఫై 7, GPS, NFC, USB-C 3.2 ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

షియోమీ 15 అల్ట్రా వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ 90W వైర్‌, 80W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5410mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. AI సెర్చ్‌, AI రైటింగ్‌, AI గెశ్చర్స్‌ రియాక్షన్స్‌, గూగుల్‌ జెమిని AI వంటి ఫీచర్‌లున్నాయి.

Xiaomi 15 Ultra Smartphone camera

షియోమీ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
షియోమీ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,09,999 గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 19 సాయంత్రం 5 PM నుంచి ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇవాళ (మార్చి 11) న ఎర్లీ యాక్సెస్‌ సేల్‌ ప్రారంభం కానుంది.

ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్ చేసుకొనే కస్టమర్‌లకు రూ.11,999 విలువ చేసే ఫొటోగ్రఫీ కిట్ లెజెండ్‌ ఎడిషన్ మరియు USB-C కెమెరా గ్రిఫ్‌, 2000mAh బ్యాటరీ, డిటార్చ్‌బుల్‌ షట్టర్‌ బటన్‌ను పొందవచ్చు. ICICI బ్యాంకు కార్డులతో రూ.10000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. షియోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌, అమెజాన్‌తోపాటు ఆఫ్‌లైట్‌ రిటైల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 15 Ultra Smartphone Launched with 200MP Camera and Snapdragon 8 Elite Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X