Home
Mobile

Xiaomi 15 Ultra vs Vivo X200 Pro.. ప్రీమియం మొబైల్స్‌ మధ్య హోరాహోరీ పోరు.. ఏది బెస్ట్ అంటే..!

Xiaomi 15 Ultra vs Vivo X200 Pro : భారతీయ మొబైల్ మార్కెట్లో తరచుగా అనేక రకాల ఫోన్లు విడుదలవుతున్నాయి. అయితే ఇటీవల మార్కెట్లోకి ఒకదాని తర్వాత ఒకటిగా షియోమీ 15 అల్ట్రా (Xiaomi 15 Ultra), వివో X200 ప్రో (Vivo X200 Pro) వంటి రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి, ఇవి రెండు దాదాపు ఒకే ధరలో లభిస్తున్నాయి. దాంతో ఈ ఫోన్ల మధ్య పోటీ నెలకొన్నది.

ఈ రెండు ఫోన్లు కూడా ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు, అద్భుతమైన కెమెరా వ్యవస్థలు, పెద్ద బ్యాటరీలను అందిస్తామని హామీ ఇస్తున్నాయి. మరి మీరేదైనా ఒకటి కొనాలనుకుంటే, ఏ ఫోన్ నిజంగా ఉత్తమమైన ప్యాకేజీని అందిస్తుంది? ఈ ఆర్టికల్‌లో వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం.

Xiaomi 15 Ultra vs Vivo X200 Pro

* పనితీరు, ప్రాసెసింగ్ పవర్

షియోమీ 15 అల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Qualcomm Snapdragon 8 Elite) చిప్‌సెట్ ఉంది. ఇది ఏకంగా 4.32GHz వేగంతో పనిచేస్తుంది. దీనికి తోడు 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఇది చాలా వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

వివో X200 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 (MediaTek Dimensity 9400) చిప్ ఉంది, ఇది 3.63GHz వేగంతో నడుస్తుంది. ఇందులోనూ 16GB RAM ఉంది, 16GB వర్చువల్ RAM, 512GB స్టోరేజ్ కూడా లభిస్తాయి. ప్రాసెసింగ్ శక్తిలో షియోమీదే కాస్త పైచేయి అయినా, వివో పనితీరు కూడా సంతృప్తి కలిగిస్తుంది.

* డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్

షియోమీ 15 అల్ట్రాలో 6.73-అంగుళాల LTPO అమోలెడ్ (AMOLED) స్క్రీన్ ఉంది. దీని రిజల్యూషన్ 1440x3200 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 522ppi ఉంది. ఇది డాల్బీ విజన్ (Dolby Vision), HDR10+ సపోర్ట్ చేస్తుంది. షియోమీ షీల్డ్ గ్లాస్ 2.0 (Xiaomi Shield Glass 2.0)తో డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ లభిస్తుంది.

వివో X200 ప్రోలో కాస్త పెద్దదైన 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, దీని రిజల్యూషన్ 1260x2800 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 452ppi. వివో స్క్రీన్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు చేరుకుంటుంది. ఇది ఎండలోనూ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను మించిపోయింది.

బ్యాటరీ విషయానికొస్తే, వివో 6000mAh భారీ బ్యాటరీతో ముందంజలో ఉంది. షియోమీలో 5410mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు 90W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. కానీ షియోమీ అదనంగా 80W వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. దానివల్ల యూజర్లకు చాలా ప్రయోజనం ఉంటుంది.

* కెమెరా పోలిక

ఇక్కడే అసలు పోటీ రసవత్తరంగా మారుతుంది. షియోమీ 15 అల్ట్రాలో 50MP క్వాడ్ రియర్ కెమెరా (వెనుక నాలుగు కెమెరాలు) ఉంది. ఇందులో పెద్ద 1-అంగుళాల LYT-900 సెన్సార్, 8K వీడియో తీయగల 200MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. 32MP ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది.

వివో X200 ప్రో శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్ (LYT-818), 50MP అల్ట్రావైడ్, ప్రత్యేక ఆకర్షణగా 200MP జైస్ APO టెలిఫోటో లెన్స్ (Zeiss APO telephoto lens). దీని ఫ్రంట్ కెమెరా కూడా 32MP.

వివో జైస్ (Zeiss) సహకారంతో పనిచేసే కెమెరా వ్యవస్థ అద్భుతమైన స్పష్టతను అందిస్తుంది. ముఖ్యంగా జూమ్‌లో మంచి క్లారిటీ ఉంటుంది. స్పష్టత కోసం జైస్ T* కోటింగ్ (Zeiss T* coating) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కెమెరా నాణ్యతే మీకు అత్యంత ముఖ్యం అయితే, X200 ప్రో విజేత కావచ్చు.

* డిజైన్, ఫీచర్లు, ధర

షియోమీ కెమెరా మాడ్యూల్ డిజైన్ లైకా (Leica) డిజైన్, రంగులను గుర్తుచేస్తుంది, ప్రొఫెషనల్ స్థాయి ఫోటో ఫలితాలను అందిస్తుంది. అయితే, పెద్ద కెమెరా బంప్ వల్ల ఇది చేతిలో కాస్త లావుగా అనిపిస్తుంది. వివో X200 ప్రో డిజైన్‌లో సింపుల్‌గా ఉన్నా, వాడే కొద్దీ వినియోగదారులకు నచ్చుతుంది.

నీరు, ధూళి నిరోధకత కోసం IP68 + IP69 రేటింగ్‌లను అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా, వివో అనవసరమైన యాప్స్ (Bloatware)ను తగ్గించింది, కానీ కొన్ని ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఇంకా ఉన్నాయి. వాటి వల్ల వినియోగదారులకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. షియోమీ సాఫ్ట్‌వేర్ సున్నితంగా, పనితీరుకు అనుకూలంగా ఉంది.

ధర విషయానికొస్తే, షియోమీ 15 అల్ట్రా రూ.1,09,999 తో అల్ట్రా-ప్రీమియం విభాగంలో ఉంది. వివో X200 ప్రో ధర రూ.94,999. ఇది షియోమీ కన్నా రూ.15,000 తక్కువకే సమగ్రమైన ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే ఈ బడ్జెట్ వరకు వెళ్లే వారికి రూ.15,000 పెద్దగా ఎక్కువ అనిపించకపోవచ్చు.

* తుది తీర్పు

ఈ రెండు ఫోన్లు వాటి వాటి విభాగాల్లో మొనగాళ్లే. షియోమీ కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్, అధునాతన వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. అయితే, వివో ప్రకాశవంతమైన డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, నెక్స్ట్-లెవల్ కెమెరా సిస్టమ్‌తో అదరగొడుతుంది. మీకు అత్యుత్తమ పనితీరు, ఫోటోగ్రఫీ కావాలంటే, షియోమీకి పెట్టిన డబ్బుకు విలువ ఉంటుంది.

కానీ, మీకు మంచి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ విషయంలో, అదీ లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో కావాలంటే, వివో X200 ప్రో తెలివైన ఎంపిక. అయితే ప్రస్తుతం ఈ రెండు ఫోన్ల ధరలు చూసి కొంచెం వెనకడుగు వేయాలనిపించొచ్చు. అలాంటి వారందరి కోసం ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ ఉపయోగపడతాయి.

ముఖ్యంగా దసరా, దీపావళి వంటి సమయాల్లో, కంపెనీలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అప్పుడు ఈ షియోమీ 15 అల్ట్రా, వివో X200 ప్రోల ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై అదనపు బోనస్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి లాభదాయకమైన డీల్స్ కూడా లభించవచ్చు.

కాబట్టి, మీరు ఈ ఫోన్లలో ఏదో ఒకటి కొనాలని గట్టిగా నిర్ణయించుకుంటే, కొద్ది రోజులు ఓపిక పట్టడం మంచిదేమో ఆలోచించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 15 Ultra vs Vivo X200 Pro Review, Ultimate Flagship Battle Camera, Performance, Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X