Home
Mobile

షియోమీ 17 సిరీస్ విడుదల తేదీ వచ్చేసింది... స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!

Xiaomi 17 Series india Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ షియోమీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. షియోమీ 17 సిరీస్‌ విడుదల తేదీన వెల్లడించింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్‌ మార్కెట్లో ఏయే ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయో స్పష్టత వచ్చింది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయి. అమెజాన్‌ కూడా ఈ వివరాలను ధ్రువీకరించింది.

షియోమీ షేర్ చేసిన వివరాల ఆధారంగా షియోమీ 17 సిరీస్ భారత్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి 28 వ తేదీన సాయంత్రం 6.30 PM గంటలకు విడుదల కానుంది. అదే రోజు గ్లోబల్‌ లాంచ్ ఈవెంట్‌ కూడా జరుగుతుంది. అయితే భారత్‌లో ప్రత్యేక లాంచ్‌ కార్యక్రమం నిర్వహిస్తారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.

Xiaomi 17 series

షియోమీ 17 సిరీస్‌ వివరాలతో అమెజాన్‌ మైక్రోసైట్‌ ప్రారంభం అయింది. అయితే విడుదల వివరాలు మినహా ఎటువంటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడి కాలేదు. ఈ సిరీస్‌ కూడా లైకా భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంటుంది. ఫలితంగా నాణ్యమైన కెమెరాలతో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

భారత్‌ మార్కెట్‌లో షియోమీ 17 సిరీస్‌లో భాగంగా షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మాత్రమే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

చైనా మార్కెట్‌లో షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. స్టాండర్డ్‌, లైకా ఎడిషన్‌ వేరియంట్స్‌లో లాంచ్ కానుంది. అయితే భారత్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ మోడల్‌ ఇటీవలే BIS సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది.

భారత్‌ మార్కెట్‌లో షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారుగా రూ.80000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర సుమారుగా రూ.1,25,000 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

* షియోమీ QLED TV X ప్రో 75 స్మార్ట్‌టీవీ బెజెల్ లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. 75 అంగుళాల QLED 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10+, 97.76 స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. డ్యూయల్‌ లైన్‌ గేట్‌ టెక్నాలజీ, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపేన్సేషన్‌ టెక్నాలజీలను కలిగి ఉంది.

షియోమీ భారీ డిస్‌ప్లే క్వాడ్‌ కోర్‌ A55 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ప్యాచ్‌వాల్‌ ఇంటర్‌ఫేస్‌ పైన పనిచేస్తుంది. కిడ్స్‌ మోడ్‌, పేరెంటల్‌ కంట్రోల్‌, యూనివర్సల్‌ సెర్చ్‌, లాంగ్వేజ్‌ యూనివర్స్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. డాల్బీ ఆడియో DTS X, DTS వర్చువల్ X సపోర్టుతో 34W స్పీకర్‌ సిస్టమ్‌ అమర్చి ఉంది.

ఈ షియోమీ టీవీ ధర రూ.69999 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.10999 విలువైన 4 సంవత్సరాల వారంటీని అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 17 series launch date revealed in india, amazon availability confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X