నాలుగు 50MP కెమెరాలు, శక్తివంతమైన చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో స్మార్ట్‌ఫోన్!
Xiaomi 17 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ షియోమీ గ్లోబల్ మార్కెట్‌లో షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. Leica భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉన్నాయి. 1.5K డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. ఈ సిరీస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల 1.5K M10 12 బిట్ OLED LTPO డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ డిస్‌ప్లే షీల్డ్ గ్లాస్ రక్షణ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 30 నిమిషాలపాటు నీటిలో ఉన్నా.. ఈ ఫోన్ డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ ఆపైన్ పింక్, ఐస్ బ్లూ, బ్లాక్, వెంచర్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ శక్తివంతమైన చిప్ :
ఈ షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 840 GPU ను కూడా అమర్చారు. ఈ చిప్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది.
నాలుగు 50MP కెమెరాలు :
ఈ ఫోన్ Leica భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు మూడు కెమెరాలున్నాయి. హైపర్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP లైట్ ఫ్యూజన్ 950 ప్రైమరీ లెన్స్ ఉంది. 50MP అల్ట్రావైడ్ కెమెరాతోపాటు OIS, 2.6x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా ఉంది.
ఈ కెమెరాలు 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ సెల్ఫీ కెమెరాతో 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 6330mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, మాగ్నటిక్ ఛార్జింగ్, 22.5W వైర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC, IR, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో మార్చి 11 వ తేదీన లాంచ్ కానుంది.


Click it and Unblock the Notifications








