ఇవాళ్టి నుంచే 200MP కెమెరా ఫోన్ సేల్.. ఈ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్..!
Xiaomi 17 Series Sale : షియోమీ 17 సిరీస్ భారత్ మార్కెట్‌లో గత వారం విడుదల అయింది. ఇందులో భాగంగా షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా మోడల్స్ విడుదల అయ్యాయి. ఈ సిరీస్ ఎర్లీ బర్డ్ సేల్ మార్చి 17 వరకు జరిగింది. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. అల్ట్రా వేరియంట్ 200MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
షియోమీ 17 సిరీస్‌ను షియోమీ వెబ్‌సైట్, అమెజాన్ సహా రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. షియోమీ 17 ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.89999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.99999 గా ఉంది. అల్ట్రా వేరియంట్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,39,999 గా ఉంది.

తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.10,000 డిస్కౌంట్‌లను పొందవచ్చు. బేస్ వేరియంట్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో, అల్ట్రా వేరియంట్ వైట్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ :
షియోమీ 17 ఫోన్ 120Hz అడాప్టి్వ్ రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల CrystalRes OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 3500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్పీ విజన్ సపోర్టును కలిగి ఉంది.
ఈ ఫోన్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. 3D ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. హైపర్ ఛార్జ్, 50W వైర్‌లెస్ హైపర్‌ఛార్జ్ సపోర్టుతో 6330mAh బ్యాటరీ ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50MP లైట్ ఫ్యూజన్ 950 కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది. 8K వీడియో రికార్డింగ్ సపోర్టును కలిగి ఉంది.
షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల HyperRGB OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, షీల్డ్ గ్లాస్ 3.0 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR+ కంటెంట్ సపోర్టు చేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. Adreno GPU, క్వాల్‌కాం AI ఇంజిన్‌లు ఉన్నాయి. 90W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా ఉంది. దీంతోపాటు 120x డిజిటల్ జూమ్, 200MP టెలిఫోటో లెన్స్ (OIS) ఉంది. 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.


Click it and Unblock the Notifications







