షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
Xiaomi 17 Smartphone : షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో త్వరలో విడుదల కానుంది. అయితే షియోమీ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ ఇటీవల BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. దీని ఆధారంగా త్వరలో భారత్ మార్కెట్ లో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు :
BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ 25113PN0E1 మోడల్ నంబర్ తో కనిపించింది. టిప్‌స్టర్ సుదన్షు అంబోర్ ఈ విషయాన్ని గుర్తించారు. అయితే షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా మోడల్స్ భారత్ మార్కెట్ కోసం టెస్టింగ్ దశలో ఉన్నట్లు ఇటీవలే టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ తెలిపారు.

భారత్ లో ఎప్పుడు విడుదల కానుంది? :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా షియోమీ 17 గ్లోబల్ మార్కెట్ లో జనవరి 2026 లో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. అయితే భారత్ లో జనవరి లేదా ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
భారత్ లో షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఈ సిరీస్ విడుదలపై షియోమీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే షియోమీ 17 సిరీస్ చైనా మార్కెట్ లో లాంచ్ అయింది.
చైనా వేరియంట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
షియోమి 17 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2656 x 1220 పిక్సల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3.0 పైన పనిచేస్తోంది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
ఈ ఫోన్ Leica భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP లైట్ ఫ్యూజన్ 950 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంది.
7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. చైనా మార్కెట్ లో ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4499 ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.56000 ) గా ఉంది. అయితే భారత్ మార్కెట్ లో ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.50000 గా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








