50MP + 50MP + 50MP + 50MP కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ పవర్‌ఫుల్ చిప్‌తో స్మార్ట్‌ఫోన్!
Xiaomi 17 Smartphone : షియోమీ 17 సిరీస్ గత నెలలో చైనా మార్కెట్‌లో లాంచ్ అయింది. తాజాగా భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా ఫోన్‌లు విడుదల అయ్యాయి. బేస్ వేరియంట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతోపాటు CrystalRes డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్, నాలుగు 50MP కెమెరాలున్నాయి. తొలి సేల్‌లో భాగంగా సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
షియోమీ 17 స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల CrystalRes OLED డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 120Hz అడాప్టి్వ్ రీఫ్రెష్ రేట్, 3500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

ఈ డిస్‌ప్లే డాల్పీ విజన్ సపోర్టును కలిగి ఉంది. HDR10+, 12 బిట్ కలర్ డెప్త్, DCI P3 కలర్ కవరేజీ సపోర్టు చేస్తుంది. ఫ్లిక్కర్ ఫ్రీ ఆపరేషన్, సర్కాడియన్ ఫ్రెండ్లీ, Low బ్లూ లైట్ వంటి TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.
శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ :
ఈ షియోమీ హ్యాండ్‌సెట్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌ను కలిగి ఉంది. Adreno GPU, క్వాల్‌కాం AI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ అనేక AI ఫీచర్లను కలిగి ఉంది. ఏఐ రైటింగ్, ఏఐ సెర్చ్, ఏఐ డైనమిక్ వాల్‌పేపర్, సర్కిల్ టు సెర్చ్, AI Speech Recognition, AI Interpreter వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 3D ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

నాలుగు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP లైట్ ఫ్యూజన్ 950 కెమెరా ఉంది. దీంతోపాటు 50MP టెలిఫోటో లెన్స్ (OIS), 50MP అల్ట్రావైడ్ కెమెరాలున్నాయి. ఆటోఫోకస్ సపోర్టుతో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.
8K వీడియో రికార్డింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపున్న కెమెరాలు 30fps తో 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. అదే 60fps తో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ 6330mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 100W హైపర్ ఛార్జ్, 50W వైర్‌లెస్ హైపర్‌ఛార్జ్ ను సపోర్టు చేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 6.0, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, AI ఆధారిత ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
షియోమీ 17 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99999 గా ఉంది. మార్చి 13 నుంచి Early Bird సేల్ ప్రారంభం కానుంది.
మార్చి 13 నుంచి 17 తేదీల మధ్యలో కొనుగోలు చేసిన యూజర్లకు 512GB స్టోరేజీ ఫోన్‌ను 256GB స్టోరేజీ ధరకే అందిస్తామని తెలిపింది. ఈ ఫోన్‌ను షియోమీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications









