Home
Mobile

200MP కెమెరా, 6.9 అంగుళాల డిస్‌ప్లే, 6800mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

Xiaomi 17 Ultra Smartphone : షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 200MP కెమెరాను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్ జెన్‌ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. అల్ట్రా ఎడిషన్‌తోపాటు Leica ఎడిషన్‌ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 6.9 అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు.

షియోమీ 17 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫోన్‌ 6.9 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌, 1060 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, డ్రాగన్‌ ‌క్రిస్టల్‌ గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Xiaomi 17 Ultra Smartphone price

శక్తివంతమైన చిప్‌సెట్ :
ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. Adreno 840 GPU ను కూడా అమర్చారు. ఈ చిప్‌సెట్‌ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్‌, UFS 4.1 స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది.

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా లైకా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వెనుక వైపు మూడు కెమెరాలున్నాయి. 50MP LOFIC (OIS) ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN5 అల్ట్రావైడ్‌ కెమెరా, 3.2x - 4.3x ఆప్టికల్‌ జూమ్‌ తో 200MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 8K వీడియోలను రికార్డు చేయవచ్చు. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

Xiaomi 17 Ultra Smartphone price

వైర్‌లెస్‌ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్‌ 90W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6800mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.4, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌ లోనే లాంచ్‌ అయింది. భారత్‌ సహా ఇతర మార్కెట్లలో విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే చైనాలో డిసెంబర్ 27 నుంచి ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

చైనా మార్కెట్‌ లో ఈ ఫోన్ 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 6999 ( భారత కరెన్సీ ప్రకారం రూ.90000), 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర CNY 7499 ( భారత కరెన్సీ ప్రకారం రూ.96000), 16GB ర్యామ్‌ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 8499 ( భారత కరెన్సీ ప్రకారం రూ.1,09,000) గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 17 Ultra Smartphone with 200MP Camera, Snapdragon 8 Elite Gen 5 chip launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X