స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి దిమ్మతిరిగేలా షియోమి Lanmi

Written By:

చైనా దిగ్గజం షియోమి టెక్నాలజీ ఇండస్ట్రీకి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోంది. అవును.. ఇప్పుడు షియోమి కొత్త సబ్ బ్రాండ్ తో మార్కెట్లోకి వస్తోంది. దానిపేరే ల్యాన్‌మి. ల్యాన్‌మి' బ్రాండు కింద తొలి స్మార్ట్‌ఫోన్‌ షావోమి 5ఎక్స్‌ను కంపెనీ త్వరలో లాంచ్‌చేయబోతుందని తాజాగా లీకయిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఎక్కువగా ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకుని వినియోగదారుల ముందుకు రాబోతుందని సమాచారం.

దుమ్మురేపిన ఆ షియోమి ఫోన్ మళ్లీ 6జిబితో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 అంగుళాల స్క్రీన్‌తో

చైనీస్‌ వెబ్‌సైట్‌ మైడ్రైవర్స్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెషిఫికేషన్లను లీక్‌ చేసింది. ఈ వెబ్‌సైట్‌ రిపోర్టు ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి వస్తోందని తెలుస్తోంది.
image source : my driver

షియోమి ఎక్స్‌1 లేదా ల్యాన్‌మి ఎక్స్‌1

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌ ఈ డివైజ్‌ కలిగి ఉండబోతుందట. ముందస్తు రూమర్లు కూడా షియోమి కొత్త బ్రాండులో కొత్త ఫోన్‌ రూపొందిస్తుందని, దాని, పేరు షియోమి ఎక్స్‌1 లేదా ల్యాన్‌మి ఎక్స్‌1 కావొచ్చని తెలిపాయి.
image source : my driver

6జీబీ ర్యామ్‌

మైడ్రైవర్స్‌ తాజా రిపోర్టుల ప్రకారం షియోమి కొత్త డివైజ్‌ వివిధ వేరియంట్లలో వస్తుందని, ప్రీమియం వేరియంట్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 చిప్‌సెట్‌ను, 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంటుందట. 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది.
image source : my driver

కెమెరా

12 ఎంపీ సెన్సార్లతో రెండు రియర్‌ డ్యూయల్‌ కెమెరాలు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ మిగతా ఫీచర్లుగా తెలుస్తున్నాయి.

జూలై 26నే

జూలై 26నే కొత్త బ్రాండులో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తుందని మైడ్రైవర్‌ పేర్కొంటోంది. దీని ధర కూడా భారత కరెన్సీలో సుమారు రూ.20వేలుగా ఉంటుందని తెలిపింది. ఒకవేళ ఈ డివైజ్‌ గురించి వచ్చే వారాల్లో షియోమి ధృవీకరిస్తే, మిగతా ఫీచర్లు కూడా తెలిసే అవకాశముంది.

మ్యాక్స్‌2

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే వివో, ఓప్పోలకు గట్టి పోటీనిస్తుందన విశ్లేషకులు చెబుతున్నారు.ఇక షియోమి మరో కొత్త ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌2ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరిస్తోంది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఇది వస్తోంది. దీని ధర రూ.17,999గా ఉండబోతుందని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi 5X with 6GB RAM may be first smartphone under new Lanmi brand; launch expected on July 26 Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot