షియోమి సరికొత్త ఎత్తుగడ, ఇండియాలో 50 వేల ఉద్యోగాలు, ఏపీలో ప్లాంటు

Written By:

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి భారత్‌లో సరికొత్త వ్యూహంతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో మూడు స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. తద్వారా 50వేల కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నామని షియోమి ఉపాధ్యక్షుడు, ఎండీ(భారత్) మను కుమార్‌ జైన్‌ తెలిపారు. ఇందుకోసం కంపెనీ రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మేకిన్‌ ఇండియా'లో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. చైనా తర్వాత భారత్‌ను మరో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రయాణికులకు IRCTC బంపరాఫర్, రూ.10 వేల నగదు మీ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మేకిన్‌ ఇండియా'కు షియోమి ఊతం..

దేశీయంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ ‘మేకిన్‌ ఇండియా'కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విపణిలో అతి తక్కువ కాలంలోనే వేగంగా విస్తరించిన షియోమి త్వరలోనే ఇక్కడ మరికొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 2.5బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా 50వేలమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.

భారత్‌ ప్రధాన కేంద్రంగా..

కాగా దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల తయారీని పెంచాలన్న ఉద్దేశంతో విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 10శాతం మేర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. పాపులేటెడ్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌(పీసీబీ)లతో సహా పలు పరికరాలపై సుంకాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రధాన కేంద్రంగా తన సేవలను మరింత విస్తరించాలని షియోమి నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌ శ్రీసిటీలో ప్లాంటు

ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో దేశంలో మూడు స్మార్ట్‌ఫోన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. చెన్నైలోని మౌంట్‌ టెక్నాలజీ ప్లాంట్‌లో ఇప్పటికే పీసీబీలను తయారు చేస్తున్నారు. దీనితో పాటు ఫాక్స్‌కాన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ శ్రీసిటీ, తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయనుంది.

ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ల్లో 95 శాతం మంది మహిళలే..

ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ల్లో 95 శాతం మంది మహిళలే ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ మూడు స్మార్ట్‌ ఫోన్‌ ప్లాంట్‌లు, చెన్నైలోని ఎస్‌ఎంటీ ప్లాంట్‌తో స్ధానికులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు సమకూరుతాయని షియోమి పేర్కొంది. 

షియోమి కొత్త ప్లాంట్ల ద్వారా

షియోమి కొత్త ప్లాంట్ల ద్వారా భారత స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో షియోమి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని షియోమీ గ్లోబల్‌ ఎండీ వైస్‌ ప్రెసిడెంట్‌ మనూ జైన్‌ చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi announces 3 new smartphone plants in India More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot