Home
Mobile

షియోమీ కొత్త ఫోన్ లాంచ్ తో, ఈ 5 షియోమీ ఫోన్ల ధరలు తగ్గాయి! కొత్త ధరలు ఇవే!

By Maheswara

మీరు షియోమీ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ ఇండియాలో కొత్త షియోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీని కారణంగా వివిధ ధరల విభాగాలలోని కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించింది. ఈ ఆఫర్ ద్వారా ధరలు తగ్గిన 5 స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాము.

షియోమీ 12 ప్రో ఫోన్ రూ. 10,000 ధర తగ్గింపు పొందింది.

షియోమీ 12 ప్రో ఫోన్ రూ. 10,000 ధర తగ్గింపు పొందింది.

షియోమీ 12 ప్రో రెండు వేరియంట్‌లలో వస్తుంది మరియు ఈ రెండు వేరియంట్ ల ఫోన్ల పై కూడా రూ. 10,000 ధర తగ్గింపు ఉంది. గత సంవత్సరం లాంచ్ చేయబడిన ఈ ఫోన్లను, ధర తగ్గిన తర్వాత వినియోగదారులు 8GB వెర్షన్‌ను రూ. 52,999 మరియు 12GB వేరియంట్‌ను రూ. 54,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కోచర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపెరా మావ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

షియోమీ 11 లైట్ NE 5G ఫోన్ రూ. 3,000 ధర తగ్గింపు పొందింది

షియోమీ 11 లైట్ NE 5G ఫోన్ రూ. 3,000 ధర తగ్గింపు పొందింది

సెప్టెంబరు 2021లో లాంచ్ చేయబడిన ఈ మధ్య శ్రేణి Xiaomi స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం రూ. 3,000 తగ్గింపును పొందింది. కస్టమర్లు ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 6GB వెర్షన్‌ను రూ. 26,999 కి మరియు 8GB వేరియంట్‌ను రూ. 28,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డైమండ్ డాజిల్, జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్ మరియు వినైల్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. షియోమీ 11 లైట్ NE 5G ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4250mAh బ్యాటరీ కి మద్దతునిస్తుంది.

షియోమీ 11i హైపర్‌ఛార్జ్ ఫోన్ రూ. 1,000 ధర తగ్గింపు పొందింది

షియోమీ 11i హైపర్‌ఛార్జ్ ఫోన్ రూ. 1,000 ధర తగ్గింపు పొందింది

షియోమీ 11i హైపర్‌ఛార్జ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన కంపెనీ యొక్క మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే రూ.1,000 తగ్గింపును అందుకుంది. కంపెనీ షియోమీ 11i హైపర్‌ఛార్జ్ 5G ని రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసింది. 6GB+128GB మరియు 8GB+128GB ధర వరుసగా వీటి ధరలు రూ.26,999 మరియు రూ.28,999. గా ఉన్నాయి.

అయితే రూ. 1,000 తగ్గిన తర్వాత, వినియోగదారులు 6GB వెర్షన్‌ను రూ. 25,999 మరియు 8GB వేరియంట్‌ను రూ. 27,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

రెడ్ మీ K50i ఫోన్ రూ. 2,000 ధర తగ్గింపు పొందింది

రెడ్ మీ K50i ఫోన్ రూ. 2,000 ధర తగ్గింపు పొందింది

షియోమీ యొక్క మిడ్-రేంజ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్, రెడ్ మీ K50i ఫోన్ ఇటీవల రూ. 2,000 ధర తగ్గింపును అందుకుంది. ఈ ధర తగ్గిన తర్వాత కస్టమర్లు ఇప్పుడు 6GB వెర్షన్‌ను రూ. 23,999 కి మరియు 8GB వేరియంట్‌ను రూ. 26,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి + డిస్‌ప్లేతో వస్తుంది మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ IP53 రేటింగ్‌తో వస్తుంది, ఇది నీటి నిరోధకతను కలిగిస్తుంది. హ్యాండ్‌సెట్ 5080mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

రెడ్ మీ 11 ప్రైమ్ 5G ఫోన్ రూ . 1,000 ధర తగ్గింపు పొందింది

రెడ్ మీ 11 ప్రైమ్ 5G ఫోన్ రూ . 1,000 ధర తగ్గింపు పొందింది

గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ధర రూ. 1,000 తగ్గింపును అందుకుంది. ఈ ధర తగ్గింపు తర్వాత, వినియోగదారులు 6GB RAM వేరియంట్‌ను రూ. 12,999 మరియు 8GB RAM వేరియంట్‌ను రూ. 14,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Announces Huge Price Cut On These 5 Smartphones, After Xiaomi 13 Pro Launch. Phones List And Price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X