టాప్ 5 షియోమి స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన టాప్ 5ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన టాప్ 5ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. షియోమి నుంచి తగ్గింపు ధరను అందుకున్న ఫోన్లలో 4జిబి అలాగే 6జిబి వేరియంట్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా Redmi Note 5 Pro, Xiaomi Redmi Y2 అలాగే 4/6జిబి వేరియంట్ Xiaomi Mi A2 లాంటి ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ల మీద దాదాపు రూ.1000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఈ తగ్గింపు ద్వారా వినియోగదారులు అసలు ధర మీద 5 శాతం తగ్గింపును అందుకోవడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తగ్గింపు అందుకున్న ఫోన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

Xiaomi Redmi Note 5 Pro (4GB+64GB)
రూ.1000 తగ్గింపు పొందిన తరువాత దీని ధర ఇప్పుడు రూ.13,999 అయింది. దీని అసలు ధర రూ. 14,999Xiaomi
Redmi Note 5 Pro (6GB+64GB)
6జిబి ర్యామ్ అలాగే 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.1000 తగ్గింది. ఇప్పుడు దీన్ని వినియోగదారులు రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A2 (4GB+64GB)
రూ.1000 తగ్గింపు పొందిన తరువాత దీని ధర ఇప్పుడు రూ.15,999 అయింది. దీని అసలు ధర రూ. 16,999
Xiaomi Mi A2 (6GB+128GB)
128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా రూ.1000 తగ్గింది. ఇప్పుడు దీన్ని వినియోగదారులు రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.దీని అసలు ధర రూ. 19,999
ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Y2
రూ.1000 తగ్గింపు పొందిన తరువాత దీని ధర ఇప్పుడు రూ.11,999 అయింది. దీని అసలు ధర రూ. 12,999.
ఫీచర్లు...
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధరలను పెంచుతూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది...
ఇదిలా ఉంటే కంపెనీ ఈ మధ్య కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది. పెంచిన ఉత్పత్తుల్లో Redmi 6 and Redmi 6A (2GB),Mi LED TVs 4C Pro, 4A Pro; and Mi Power Bank 2 లాంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications