కొత్త లుక్‌తో Redmi Note 4, ఈ రోజు నుంచే సేల్

చైనా బ్రాండ్ షియోమి, తన రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెషల్ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Redmi Note 4 Lake Blue edition పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : ఒక్క రోజులో 60 లక్షల జియోఫోన్‌లను బుక్ చేసారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘Wake the lake' ప్రాజెక్టులో భాగంగా..

‘Wake the lake' పేరుతో షియోమి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులో భాగంగా ఈ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ క్రింద లాంచ్ చేయబోయే అన్ని ఫోన్‌లు స్వచ్చ్‌ భారత్‌ అభియాన్ కార్యక్రమాన్ని ప్ర్తోత్సహించేవిగా ఉంటాయని షియోమి తెలిపింది. ఈ ఫోన్‌లో ఒక కలర్ మినహాయించి స్పెసిఫికేషన్స్ అన్ని పాత రెడ్‌మి నోట్ 4 తరహాలోనే ఉంటాయి.

రెడ్‌మి నోట్ 4 (Lake Blue edition) స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

సెప్టంబర్ 4 నుంచి సేల్..

రెడ్‌మి నోట్ 4 (Lake Blue edition) స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ ఇంకా 64జీబి స్టోరేజ్ వర్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ధర రూ.12,999. సెప్టంబర్ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి Mi.com, Flipkartలో సేల్ ప్రారంభమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Announces Redmi Note 4 Lake Blue Edition With 4GB RAM and 64GB Internal Storage at Rs. 12,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot