చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ షావోమి రెండు సరికొత్త పవర్ బ్యాంక్‌లను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. 10000 ఎమ్ఏహెచ్, 20000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కెపాసిటీల్లో ఈ పవర్ బ్యాంక్స్ అందుబాటులో ఉంటాయి.
10000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ ధర రూ.799. 20000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ ధర రూ.1499. ఈ వవర్ బ్యాంక్‌లను షావోమి ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్ అయిన Mi.comతో పాటు Mi Home స్టోర్‌లలో అఫీషియల్‌గా విక్రయించనున్నారు. నవంబర్ 23 నుంచి సేల్ ప్రారంభమైంది.
నోయిడా ప్రొడక్షన్ ప్లాంట్‌లో తయారీ...
ఈ పవర్ బ్యాంక్‌లను నూతనంగా ఏర్పాటు చేసుకున్న నోయిడా ప్రొడక్షన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. హైప్యాడ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో నెలకొల్పబడిన ఈ ప్లాంట్‌లో ప్రత్యేకించి ఎంఐ పవర్ బ్యాంక్‌లను మాత్రమే తయారు చేస్తారు. 2,30,000 చదరపు అడుగుల విస్తర్ణంలో ఏర్పాటైన ఈ ఫెసిలిటీలో వేర్‌హౌస్‌తో పాటు క్వాలిటీ డిపార్ట్‌మెంట్ అలానే డెడికేటెడ్ పవర్‌బ్యాంక్ అసెంబ్లీ లైన్ ఉంది. ప్లాంట్ ఆపరేషనల్ అవర్స్‌లో నిమిషానికి 7 పవర్ బ్యాంక్స్‌ను ఈ ప్రొడక్షన్ యూనిట్ అందించగలదు.
కాంపోనెంట్స్ కూడా ఇక్కడ నుంచే...
ప్రస్తుతానికి పవర్ బ్యాంకుల తయారీకి అవసరమైన బ్యాటరీలతో పాటు పీసీబీలను చైనా నుంచి కవర్‌తో పాటు ఇతర కాంపోనెంట్‌లను లోకల్ తయారీదారుల నుంచి షావోమి దిగుమతి చేసుకుంటోంది. అయితే త్వరలో వీటిని కూడా హైప్యాడ్ ఫెసిలిటీలోనే తయారు చేయబోతున్నట్లు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు.
పూర్తిస్థాయి బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్...
పవర్ బ్యాంక్ నిర్మాణంలో బ్యాటరీ సెల్ అనేది కీలక కాంపోనెంట్. పవర్ బ్యాంక్‌లలో పొందుపరిచే బ్యాటరీ సెల్స్‌కు టెస్టింగ్ అనేది చాలా అవసరం. దీని పై మను కుమార్ జైన్ స్పందిస్తూ బ్యాటరీ పూర్తిస్థాయిలో పరీక్షింందుకు నోయిడా ప్రొడక్షన్ ప్లాంట్‌లో ప్రత్యేకమైన టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
షియోమి నుంచి దేశ్ కా స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరకే !
10000 ఎమ్ఏహెచ్, 20000 ఎమ్ఏహెచ్...
నోయిడా ప్రొడక్షన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేసిన పవర్‌బ్యాంక్‌లను పరిశీలించినట్లయితే 10000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోన్న ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ సొగసైన డబుల్ యానోడైజ్డ్ అల్యూమినియం డిజైన్‌తో లైట్ వెయిట్‌ను కలిగి ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ పూర్తి ఛార్జ్ పై ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను 2.2 సార్లు,
రెడ్‌మి నోట్ 4ను 1.5 సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలుగుతుంది. 20000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోన్న ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ పాలికార్బోనేట్ కేస్‌తో ఎక్స్‌ట్రా గ్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్‌లో రెండు వేరువేరు 10,000ఎమ్ఏహెచ్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ 3.0 క్విక్‌ఛార్జ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.
లిథియమ్ పాలిర్ బ్యాటరీస్, డ్యుయల్ యూఎస్బీ సెటప్..
ఈ రెండు పవర్ బ్యాంక్‌లు లిథియమ్ పాలిర్ బ్యాటరీలతో వస్తున్నాయి. డ్యుయల్ యూఎస్బీ పోర్ట్స్‌తో మల్టిపుల్ డివైస్‌లను చార్జ్ చేసుకునే వీలుంటుంది. 9 లేయర్లతో కూడిన వరల్డ్-క్లాస్ సర్క్యూట్ చిప్ ప్రొటెక్షన్, అడాప్టెడ్ యూఎస్బీ స్మార్ట్ - కంట్రోల్ చిప్స్, ఛార్జింగ్-డిస్‌ఛార్జింగ్ చిప్స్ పవర్ బ్యాంక్ పనితీరును మరింతగా మెరుగుపరుస్తాయి.
ఒరిజినల్ ఎంఐ పవర్ బ్యాంక్‌ను గుర్తించటం ఎలా..?
ఏదైనా ఒక బ్రాండెడ్ క్వాలిటీ వస్తువు మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు ఆ వెనువెంటనే దాని డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోన్న నకిలీ వస్తువుల జాబితాలో పవర్ బ్యాంక్‌లు ముందంజలో ఉన్నాయి.
ముఖ్యంగా ఎంఐ బ్రాండ్‌ను పోలిన నకిలీ పవర్ బ్యాంక్‌లు ఇబ్బడి మబ్బడిగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒరిజినల్ ఎంఐ పవర్ బ్యాంక్‌లను కొనుగోలు చేసేముందు ప్యాకేజింగ్‌ను నిశితంగా పరిశీలించండి.
ఒరిజినల్ ఎంఐ పవర్ బ్యాంక్ ప్యాకేజింగ్ పై ఎంఐ లేబుల్‌తో కూడిన స్టిక్కర్ ఉంటుంది. లేబుల్‌ను స్ర్కాచ్ చేసినట్లయితే ఓ కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్ కంపెనీ డేటా బేస్‌తో లింక్ అయి ఉంటుంది. షావోమి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఈ కోడ్‌ను క్రాస్ చెక్ చేసుకోవచ్చు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.