షియోమి గేమింగ్ స్మార్ట్‌ఫోన్, ఆసక్తి రేపుతున్న కొత్త ఫీచర్లు

Written By:

చైనా దిగ్గజం షియోమి తన మరో సంచలనానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదిరిపోయే ఫీచర్లతో మొబైల్స్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చిన షియోమి ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదిరిపోయే ఫీచర్లతో తొలిసారిగా బ్లాక్ షార్క్ పేరిట‌ ఓ నూత‌న‌ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను షియోమి విడుదల చేయనుంది. ఈ నెల 13వ తేదీన ఈ ఫోన్ గురించి షియోమీ వివరాలను వెల్లడించనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు చెందిన పలు టీజర్ ఇమేజ్‌లను షియోమీ విడుదల చేయగా వాటి పట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. టీజర్ ఇమేజ్ ప్రకారం షియోమీ గేమింగ్ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉండనున్నట్లు తెలిసింది. అలాగే పవర్ బటన్ వెనుక గ్రీన్ కలర్ ఎల్‌ఈడీ లైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

వన్‌ప్లస్ 6 ఇండియా ధర లీకైంది : 33,999 నుండి మొదలు..

కాగా ఏప్రిల్ 13న బ్లాక్ షార్క్ నూత‌న‌ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైఎండ్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి 13న దూసుకొస్తుందని అనధికార వర్గాలు వెల్లడించాయి.

షియోమి గేమింగ్ స్మార్ట్‌ఫోన్, ఆసక్తి రేపుతున్న కొత్త ఫీచర్లు

షియోమీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లు ఉండనున్నట్లు తెలిసింది. కాగా ఈ ఫోన్ Antutu benchmark websiteలో స్పాట్ అయింది. ఆ సైటే ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను లీక్ చేసింది.

కాగా ఈ ఫోన్ వస్తుందనే విషయాన్ని Weibo కూడా ధృవీకరించింది. షియోమి నుంచి వస్తున్న ఫస్ట్ రియల్ గేమ్ ఫోన్ కూడా ఇదేనని Weibo తన పేజీలో పోస్ట్ చేసింది. కాగా దీని ధర వివరాలను మాత్రం బయటకి రాలేదు. అలాగే మరికొన్ని ఫీచర్లు కూడా లీక్ కాలేదు. కేవలం ముఖ్యమైన ఫీచర్లు మాత్రమే లీకయ్యాయి. మరిన్ని వివరాలకోసం 13 వరకు ఆగాల్సిందే.

ఫీచర్లు అంచనా
18:9 aspect ratio display,
Qualcomm Snapdragon 845 processor,
Adreno 630 GPU,
8GB RAM, 32GB ROM
Android 8.0.0 Oreo ,
2160 x 1080 pixels resolution

ఈ ఫోన్ AnTuTu benchmarksలో 2,70,680 points స్కోర్ చేసింది. శాసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ కన్నా ఈ స్కోర్ చాలా ఎక్కువ. కాగా ఈ ఫోన్ మీద ఇప్పటినుంచే ఊహగానాలు మొదలయ్యాయి. గేమింగ్ ప్రియుల కోసం ఫర్పెక్ట్ ఫోన్ అంటూ టెక్ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

English summary
Xiaomi-backed Black Shark shares teaser for gaming smartphone, launch on April 13 More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot