32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!
షియోమీ ఇటీవల చైనాలో Civi 4 ప్రో ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో భారత్‌లోనూ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ షియోమీ 14 సివి (Xiaomi 14 Civi) పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
అయితే భారత్‌లో (Xiaomi 14 Civi in india Launch) విడుదల కానున్న ఫోన్ చైనాలో విడుదల అయిన వేరియంట్ తరహా ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే భారత్ వేరియంట్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ 8S జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

షియోమీ 14 సివి స్పెసిఫికేషన్లు! :
షియోమీ 14 సివి స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
షియోమీ 14 సివి స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీ తో జతచేయబడే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేసే అవకాశం ఉంది.
దీంతోపాటు కెమెరా విభాగం పరంగా ఈ షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP Leica పొర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 32MP+32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఈ షియోమీ 14 సివి స్మార్ట్‌ఫోన్ వైఫై, బ్లూటూత్ 5.4, NFC మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. అయితే ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై షియోమీ సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం ఇప్పటివరకు వెల్లడి కాలేదు.
షియోమీ 14 సివి స్మార్ట్‌ఫోన్ గత నెలలో విడుదల అయిన షియోమీ 14 హ్యాండ్‌సెట్ కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. షియోమీ 14 ధర రూ.69,999 గా ఉండగా.. ఈ కొత్త ఫోన్ ధర రూ.50,000-60,000 గా ఉండే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








