షియోమి సంచలనం, నచ్చిన రంగుల్లోకి మీ ఫోన్‌ని మార్చుకోవచ్చు !

Written By:

ప్రపంచంలో టెక్నాలజీ శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త విప్లవాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ ప్రపంచంలో యూజర్లకు అనుకుణగంగా అనేక రకాలైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ రివల్యూషన్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు అలాగే ఇప్పుడు మడత పెట్టే ఫోన్లు త్వరలో మార్కెట్లోకి దూసుకువస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే షియోమి మరో సరికొత్త విప్లవానికి తెరలేపబోతోంది. ఈ మొబైల్ సంస్థ త్వరలోనే రంగులు మార్చుకోగలిగే కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుందట. షియోమీ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించి తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. కాగా ఇప్పుడు కంపెనీ నుంచి ఏ ఫోన్ వచ్చినా మూడు, నాలుగు రకాల రంగుల్లో ఆయా మోడళ్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ట్విట్టర్లో షియోమీ తెలిపిన ప్రకటన ప్రకారం.. త్వరలో తాము కొత్త మోడల్‌ ఫోన్‌ను విడుదల చేస్తున్నామని ఈ ఫోన్‌కు రంగు మార్చుకోగలిగే సామర్థ్యం ఉంటుందని పేర్కొంది. అంటే మీరు ఏ రంగు కావాలనుకుంటే ఆ రంగులోకి ఫోన్‌ మారిపోతుందట. కాగా సంస్థ ట్వీట్‌ వినియోగదారులను విపరీతంగా ఆకర్షించింది. దీంతో వెంటనే దీనికి భారీ స్థాయిలో స్పందిస్తూ ట్వీట్లు పెట్టారు.

షియోమి సంచలనం, నచ్చిన రంగుల్లోకి మీ ఫోన్‌ని మార్చుకోవచ్చు !

షియోమీ చాలా బాగా ప్రయత్నించిందని.. ఈ సారి మమ్మల్ని ఫూల్‌ చేయలేరు అంటూ చాలామంది సమాధానం ఇచ్చారు. ఇంకొంతమంది ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సంస్థ అలాంటిదేమీ లేదని మరో ట్వీట్‌ చేసింది.

షియోమి లాస్ట్ డే ఆఫర్స్,డీల్స్ ,డిస్కౌంట్లు మీకోసం..

నిజానికి ప్రతి ఏడాది షియోమీ సంస్థ ఏ్రపిల్‌ 1 వ తేదీ కంటే ముందు ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేయడం.. తదుపరి 1వ తేదీన 'ఏప్రిల్‌ ఫూల్'‌ అంటూ సరదాగా ప్రకటించడం చేస్తుంటుంది. ఈసారి కూడా అలాగే ప్రయత్నిస్తోంది అనేది చాలా మంది వినియోగదారుల భావన. అయితే షియోమి అలాంటిదేమి లేదని నిజంగానే ఇలాంటి ఫోన్ మార్కెట్లోకి రాబోతుందని స్పందించడంతో వినియోగదారుల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మరి షియోమి ట్వీట్ నిజంగానే ఏప్రిల్‌ ఫూల్‌ ప్రకటనా లేక నిజంగానే అలాంటి ఫోనే తీసుకువస్తుందా అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

English summary
xiaomi-to-launch-new-phone-with-color-changing-ability More news at gibzot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot