Xiaomi నుంచి మరో సంచలన ఫోన్ ఇండియాకు వస్తోంది
Xiaomi మొట్టమొదటి డ్యుయుల్ కెమెరా ఫోన్ వచ్చే నెలలో ఇండియాకు రాబోతోంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ, డ్యుయల్ కెమెరాలను ప్రాధాన్యతనిస్తూ రెండు కెమెరా సెంట్రిక్ ఫోన్‌లను చైనా మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ లు Mi 6, Mi 5X పేర్లతో ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్నఈ ఫోన్‌లలో ఒక మోడల్‌ను త్వరలో భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలానే వైస్-ప్రెసిడెంట్ మను కుమార్ జైయిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
Can you guess which one? pic.twitter.com/UhtFphm0GT— Manu Kumar Jain (@manukumarjain) August 8, 2017 '>
ఆ ఫోన్ ఏంటో మీరు గెస్ చేయగలరా..?
Xiaomi మొట్టమొదటి డ్యుయుల్ కెమెరా ఫోన్ వచ్చే నెలలోనే ఇండియాకు వచ్చేస్తోంది. ఆ ఫోన్ ఏంటో మీరు గెస్ చేయగలరా..? అంటూ మను కుమార్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసారు.

Mi 5X రీసెంట్‌గా మార్కెట్లో లాంచ్ అయ్యింది..
Mi 6 తో పోలిస్తే Mi 5X రీసెంట్‌గా మార్కెట్లో లాంచ్ అయ్యింది. జూలై ఆఖరిలో ఈ ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది. బహుశా ఈ ఫోన్‌నే ఇండియాలో లాంచ్ చేసే అవకాశముంది. 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వర్షన్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర చైనా మార్కెట్లో CNY 1,499గా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.14,200.

ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా..
ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు 12 మెగా పిక్సల్ కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి టెలీఫోటో జూమింగ్ కోసం పనిచేస్తే మరొకటి వైడ్ యాంగిల్ షాట్స్ కోసం పనిచేస్తుంది. వైడ్-యాంగిల్ లెన్స్‌ను క్యాప్చుర్ చేసే సెన్సార్ f/2.2 apertureతో వస్తుంది. టెలీఫోటో జూమ్ లెన్స్‌తో వచ్చే సెన్సార్ f/2.6 apertureతో వస్తుంది. ఫోన్ ముందుగా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

Xiaomi Mi 5X స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, డీహెచ్ఎస్ ఆడియో క్యాలిబ్రేషన్ అల్గారిథమ్, 3080mAh బ్యాటరీ, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ కర్వుడ్ ఎడ్జెస్.

Xiaomi Mi 6 స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
ఏప్రిల్‌లో మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 835 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ పై రన్ అవుతుతంది. 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ విషయానికి వచ్చేసిరకి 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 5.15 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,350mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.


Click it and Unblock the Notifications








