షియోమీ దీపావళి సేల్ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
పండగ సీజన్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ షియోమీ దీపావళి సేల్‌ను (Xiaomi Diwali Sale 2024) ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా షియోమీ 14, షియోమీ 14 సివీ హ్యాండ్‌సెట్‌లను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల ధరలు మరింత తగ్గనున్నాయని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధరల వివరాలతో పూర్తి కథనం.
దీపావళి సేల్ సందర్భంగా షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్‌ను (Xiaomi 14 Civi Smartphone) అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకు ఆఫర్లతో కలిపి 8GB ర్యామ్ + 256GB స్టోరేజీని రూ.37,999 కే కొనుగోలు చేయవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చంజీ చేయడం ద్వారా రూ.3000 ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు. దీంతోపాటు కూపన్ కోడ్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

షియోమీ దీపావళి సేల్ 2024 లో భాగంగా 9 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు షియోమీ ప్రయారిటీ క్లబ్, 6 నెలల పాటు 100GB వరకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.
షియోమీ 14 సివీ స్పెసిఫికేషన్‌లు :
షియోమీ 14 సివీ 6.55 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడింది. ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP+ 50MP + 32MP కెమెరాలతోపాటు ముందు వైపు రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. 32MP + 32MP కెమెరాలను కలిగి ఉంది. ఈ షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ (Xiaomi 14 Smartphone) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.8000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ 6.36 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో రక్షణను పొందింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. Adreno 750 చిప్, గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 50MP + 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4610mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








