షియోమి రూ. 500 కోట్ల బహుమతులు, ఆ ఫోన్‌పై మాత్రమే !

Written By:

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తన తాజా స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ఎను మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం దాని ధరను ఫీచర్లను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా షియోమి ట్విట్టర్ ద్వారా తన సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.

Redmi 5Aపై ఆఫర్లు, రూ. 3999కే సొంతం చేసుకోమంటున్న జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంఐ వినియోగదారులకు..

స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ చరిత్రలో షియోమీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుందని, ఎంఐ వినియోగదారులకు బహుమతుల రూపంలో రూ.500 కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినట్టు ట్విట్టర్లో పేర్కొంది.

రెడ్‌మీ 5ఎ తొలి 50 లక్షల ఫోన్లను రూ.4,999కే..

అందులో భాగంగానే రెడ్‌మీ 5ఎ తొలి 50 లక్షల ఫోన్లను రూ.4,999కే ఇవ్వనున్నట్టు తెలిపింది. ‘దేశ్ కా స్మార్ట్‌ఫోన్' పేరుతో విడుదల చేసిన రెడ్‌మీ 5ఎను డిసెంబరు 7న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు.

ఇండియాలో..

ఇండియాలో 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉన్నా, చైనాలో 2 జీబీ ర్యామ్, 16 జీబీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.

అత్యంత చవకైన షియోమీ స్మార్ట్‌ఫోన్ ఇదే..

రెడ్ మీ 5 ఎ (2జీబీ/16 జీబీ) అసలు ధర రూ.5,999 కాగా, 3జీబీ/32 జీబీ అసలు ధర రూ.6,999. అయితే తొలి 50 లక్షల ఫోన్ల(2జీబీ వేరియంట్)ను వెయ్యి రూపాయల రాయితీతో రూ.4,999కే అందించనుంది. అంటే మొత్తం రూ.500 కోట్లను వెనక్కి ఇవ్వనున్నట్టు లెక్క. కాగా అత్యంత చవకైన షియోమీ స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది.

ఇండియాలో విక్రయించనున్న అన్ని ఫోన్లు..

ఇండియాలో విక్రయించనున్న అన్ని ఫోన్లు ఇక్కడే తయారు కావడం గమనార్హం.

ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. డ్యూయల్ స్లిమ్ స్లాట్, ఎస్డీ కార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్ ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi gives away Rs 500 crore gift to Mi phone users: How to avail offer benefit More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot