Home
Mobile

షియోమి ఆ రెండింటి ధరలను పెంచేసింది !

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఇండియాలో తన ఉత్పత్తులపై ధరలను పెంచేస్తోంది.

By Hazarath Aiah

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఇండియాలో తన ఉత్పత్తులపై ధరలను పెంచేస్తోంది. ఇందులో భాగంగా తన పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ధరలను అమాంతం పెంచేసింది. రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధరను వెయ్యి రూపాయలు, 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ను రూ.5000 ధరలు పెంచినట్టు షియోమి తెలిపింది. పెంచిన ధరలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రెడ్‌మి నోట్‌ 5 ప్రొకు, ఎంఐ టీవీ 4కు దేశీయ మార్కెట్‌లో భారీ ఎత్తున్న డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటికి వస్తున్న డిమాండ్‌ను షావోమి చేరుకోలేకపోతోంది. దీంతో కంపెనీ ఇక్కడే వీటిని రూపొందించాలని కూడా నిర్ణయించింది.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ విషయంలో..

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ విషయంలో..

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ విషయంలో పీసీబీఏలను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ దిగుమతి చేసుకుంటున్న పీసీబీఏలపై పన్ను మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటికి తమ ఖర్చులను పెంచుతున్నాయని కంపెనీ తెలిపింది.

ధరలు

ధరలు

దీంతో ఎంఐ ఎల్‌ఈడీ టీవీ ధరను రూ.5000 మేర పెంచి, రూ.44,999గా నిర్ణయించింది. రూ.13,999గా ఉన్న రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధర కూడా రూ. 14,999కు పెరిగింది. 2018 మే 1 నుంచి అన్ని ఎంఐ హోమ్‌ స్టోర్లు, ఎంఐ.కామ్‌లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ప్రీ-ఆర్డర్లకు

ప్రీ-ఆర్డర్లకు

కంపెనీ ఇటీవల చేపట్టిన రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫోన్‌కు చేపట్టిన ప్రీ-ఆర్డర్లకు భారీ ఎత్తున్న డిమాండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇటీవలే భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌ తయారీ యూనిట్లను ప్రారంభించినట్టు పేర్కొంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

Best Mobiles in India

English summary
Xiaomi increases price of Mi TV 4, Redmi Note 5 Pro by up to Rs 5,000 to meet growing demand More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X