ఇండియాని టార్గెట్ చేసిన షియోమి,కోట్ల పెట్టుబడులతో Next plan ఇదే..

సరికొత్త వ్యూహంతో దిగుతున్న షియోమి ఇండియాలో పట్టు సంపాదించాలనే వ్యూహాంతో భారీ వ్యూహాలకు తెరలేపుతోంది.

By Hazarath
|

సరికొత్త వ్యూహంతో దిగుతున్న షియోమి ఇండియాలో పట్టు సంపాదించాలనే వ్యూహాంతో భారీ వ్యూహాలకు తెరలేపుతోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న షియోమి ఇండియాలో తనకు ఎదురులేని విధంగా ఇండియా మార్కెట్ ని రెడీ చేస్తోంది. కోట్ల పెట్టుబడులకు తెరలేపింది.

ఆపిల్ కంపెనీకి చిక్కులు, వారెంట్ నోటీసులుఆపిల్ కంపెనీకి చిక్కులు, వారెంట్ నోటీసులు

 100 స్టార్ట్‌అప్‌లు: 100కోట్ల డాలర్ల పెట్టుబడులు

100 స్టార్ట్‌అప్‌లు: 100కోట్ల డాలర్ల పెట్టుబడులు

ఇప్పుడు ఇండియాలో షియోమి 100 స్టార్ట్‌అప్‌లు: 100కోట్ల డాలర్ల పెట్టుబడులంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది.

రాబోయో అయిదేళ్లలో..

రాబోయో అయిదేళ్లలో..

రాబోయో అయిదేళ్లలో స్టార్ట్‌అప్‌ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని షియోమి అనుకుంటోంది. ఈ పెట్టుబడులతో ఇండియా మార్కెట్లో శాంసంగ్‌, వివో, ఒప్పో లాంటి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా కంపెనీని రెడీ చేస్తోంది.

మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకాన్ని..

మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకాన్ని..

మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకాన్ని బాగా విస్తరించే కంపెనీల్లో ఈ పెట్టుబడులను పెట్టనుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకోవాలని యోచిస్తోంది.

ఎకో సిస్టంను సృష్టించేందుకు..

ఎకో సిస్టంను సృష్టించేందుకు..

కాగా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో ఎకో సిస్టంను సృష్టించేందుకు దాదాపు 100 కంపెనీల్లో బిలియన్‌ డాలర్ల (100కోట్ల డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ ప్రకటించింది.

చైనాలో గత నాలుగు సంవత్సరాలలో..

చైనాలో గత నాలుగు సంవత్సరాలలో..

చైనాలో గత నాలుగు సంవత్సరాలలో తాము 300 కంపెనీల్లో 4 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టామని.. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో భారత్‌లో 100 కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టబోతున్నామని షావోమి చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జూన్‌ వెల్లడించారు.

ఎకోసిస్టం నమూనాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు..

ఎకోసిస్టం నమూనాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు..

చైనాలో బాగా విజయవంతమైన ఎకోసిస్టం నమూనాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఆసక్తి ఉన్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకాన్ని ప్రోత్సహించే కంపెనీలపై తాము ఆసక్తిగా ఉన్నామని, మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్‌తో సంబంధం ఉన్నంత కాలం ఆయా కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తామని లీ తెలిపారు.

Best Mobiles in India

English summary
Xiaomi to invest USD 1 billion in Indian startups, introduce new products Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X