Home
Mobile

Redmi 4S వచ్చేస్తోంది

రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లకు సక్సెసర్ వర్షన్స్ అయిన రెడ్మీ 4ఎస్, రెడ్మీ 4ఎస్ ప్రైమ్‌లను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తెలిపారు.

By Sivanjaneyulu Bommu

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ కొద్ది రోజుల క్రితం తన Redmi 4A స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 2జీబి ర్యామ్, 16జీబి స్టోరేజ్, 4జీ వోల్ట్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.5,999గా ఉంది. నేటి మధ్యాహ్నం నుంచి అమెజాన్ ఇండియాలో సేల్ ప్రారంభమవుతుంది.

Read More : రూ.15,000ల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్స్

రెడ్మీ 4ఎస్, రెడ్మీ 4ఎస్ ప్రైమ్‌

రెడ్మీ 4ఎస్, రెడ్మీ 4ఎస్ ప్రైమ్‌

షియోమీ రెడ్మీ ఫోన్‌లకు సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లకు సక్సెసర్ వర్షన్ లైన రెడ్మీ 4ఎస్, రెడ్మీ 4ఎస్ ప్రైమ్‌లను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధృవీకరించారు.

రెడ్మీ 4ఎస్, 4ఎస్ ప్రైమ్‌

రెడ్మీ 4ఎస్, 4ఎస్ ప్రైమ్‌

ఈ సగం ఫోటోలు చూస్తూంటే ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ 4 ఫోన్‌ను తలపిస్తోంది. రెడ్మీ 4 ఇంకా రెడ్మీ 4 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో దొరుకుతున్నాయి. రెడ్మీ 4 ధర CNY 699, రెడ్మీ 4 ప్రైమ్ ధర CNY 899. గోల్డ్, సిల్వర్, డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచారు. వీటినే భారత్‌లో రెడ్మీ 4ఎస్, 4ఎస్ ప్రైమ్‌లుగా లాంచ్ చేసే అవకాశముంది.

 రెడ్మీ 4 స్పెసిఫికేషన్స్‌

రెడ్మీ 4 స్పెసిఫికేషన్స్‌

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), 2.5డీ కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,  స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100 mAh బ్యాటరీ.

రెడ్మీ 4 ప్రైమ్ స్పెసిఫికేషన్స్‌

రెడ్మీ 4 ప్రైమ్ స్పెసిఫికేషన్స్‌

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), 2.5డీ కర్వుడ్ గ్లాస్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100 mAh బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Xiaomi to launch Redmi 3S and Redmi 3S Prime successors in India soon. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X