Mi Max 2 ఇప్పుడు 32జీబి వేరియంట్‌లో
రూ.12,999కే అమెజాన్ ఇండియాలో లభ్యం. సెప్టంబర్ 20 నుంచి సేల్..
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi తన Mi Max 2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 32జీబి వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.12,999. సెప్టంబర్ 20న మొదటి సేల్ జరుగుతుంది. అమెజాన్ ఇండియాతో పాటు Mi.Com, Mi Home స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Mi Max 2 స్పెసిఫికేషన్స్.. 6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5300mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై 100జీబి ఉచిత 4జీ డేటాను రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోంది. రూ.309 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ పై ఈ ఉచిత డేటా లభిస్తుంది.


Click it and Unblock the Notifications