ఆన్‌లైన్ బుకింగ్స్ లేవు, మీ ఊరికే Redmi 3S Plus

చైనా యాపిల్‌గా పిలవ బడుతోన్న ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ భారత్‌లో అమ్మకాల సునామీని సృష్టిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన . రెడ్మీ 3ఎస్, రెడ్మీ నోట్3, రెడ్మీ 3ఎస్ ప్లస్ ఫోన్‌లు ఆన్‌లైన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఆన్‌లైన్ బుకింగ్స్ లేవు.. మీ ఊరికే Redmi 3S Plus

Read More : లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్స్.. రూ.17,490కే

ఇప్పటి వరకు షియోమీ తన రెడ్మీ ఫోన్‌లను ఈ-కామర్స్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ బ్రాండ్ రెడ్మీ 3ఎస్ ప్లస్ పేరుతో సరికొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో మాత్రమే లభ్యమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్

ఈ ఆఆఫ్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్‌ దేశవ్యాప్తంగా ఉన్న 7,500 రిటైల్ స్టోర్‌లలో అక్టోబర్ 1 నుంచి విక్రయిస్తున్నారు.

డిస్‌ప్లే ఇంకా కెమెరా

రెడ్మీ 3ఎస్ ప్లస్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720 పిక్సల్స్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : పీడీఎఏఫ్, ఎల్ఈడి ఫ్లాష్, , ఎఫ్/2.0 అపెర్చుర్) , 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎఫ్/2.2 అపెర్చుర్))

 

 

ప్రాసెసర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టం

రెడ్మీ 3ఎస్ ప్లస్ ఫోన్, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 సీపీయూతో వస్తోంది. ఈ 64 బిట్ ప్రాసెసర్‌కు జతగా అడ్రినో 505 జీపీయూను నిక్షిప్తం చేసారు. 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో) ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.

బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

రెడ్మీ 3ఎస్ ప్లస్ ఫోన్ శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్. 4G VoLTE సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో జియో నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.

రూ.9,499 ధర ట్యాగ్‌తో

3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో పొందుపరిచారు. రూ.9,499 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. రెడ్మీ 3ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను పూర్వికా, సంగీతా, బిగ్‌సి, లాట్ మొబైల్స్‌లో విక్రయిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiamoi launches Redmi 3S plus, 5 Things you should Know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot