4జీ కనెక్టువిటీతో జియోమీ రెడ్‌మై నోట్@రూ.9,999

Posted By:

చైనాలో 5 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ (Xiaomi) తమ ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. కొద్ది నెలల క్రితం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జియోమీ ఎమ్ఐ3, రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై‌ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది.

4జీ కనెక్టువిటీతో జియోమీ రెడ్‌మై నోట్@రూ.9,999

వీటిలో జియోమీ రెడ్‌మై 1ఎస్ ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోంది. తాజాగా రెడ్‌మై నోట్ ఫాబ్లెట్ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు జియోమీ తెలిపింది. 3జీ ఇంకా 4జీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యకానుంది. 3జీ వేరియంట్ ధర రూ.8,999. 4జీ వేరియంట్ ధర రూ.9,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

జియోమీ రెడ్‌మై నోట్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఐపీఎస్ స్ర్కీన్‌ ప్యానల్ (180డిగ్రీల వెడల్పు వీక్షణా కోణంతో), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్), 4జీ ఎల్టీఈ వేరియంట్ రెడ్ మై నోట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.4గిగాహెట్జ్) పై రన్ అవుతుంది. అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, జియోమీ రెడ్‌మై నోట్ 3జీ వేరియంట్ డ్యూయల్ సిమ్ కనెక్టువిటీని కలిగి ఉంటుంది.

జియోమీ రెడ్‌మై నోట్ 4జీ వేరియంట్ సింగిల్ సిమ్ కనెక్టువిటీని కలిగి ఉంటుంది. 13 మెగాపిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఆక్టా‌కోర్ వేరియంట్ రెడ్‌మై నోట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4జీ ఎల్టీఈ వేరియంట్ స్టోరేజ్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకోవచ్చు. 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. ఎమ్ఐయూఐ వీ5 ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Xiaomi Launches Redmi Note And Its 4G Variant at Rs 8,999 and Rs 10,000. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting