జనవరి 10న మార్కెట్లోకి రానున్న షియోమి 48మెగాపిక్స‌ల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌..!

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది. ఇందులో భాగంగా 48 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్‌ 'రెడ్‌మి ప్రో 2'ను జనవరి 10వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్ ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ ఫోన్‌కు చెందిన ఇతర స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు.

షియోమి నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్షియోమి నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ...

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ...

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణను సంస్థ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది.షియోమి అధ్యక్షుడు లిన్ బిన్ చైనా సోషల్ మీడియా వేదిక వైబో ద్వారా గత నెలలోనే ప్లస్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ గల షియోమి మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్ క్లోజప్ వ్యూను పోస్ట్ చేశారు.ఈ ఫోటో ప్రకారం ఎల్ఈడీ ఫ్లాష్‌తో వెర్టికల్ కెమెరా ఉంటుందని అర్థమవుతుంది.

హానర్ కూడా ఇప్ప‌టికే Honor V20ను...

హానర్ కూడా ఇప్ప‌టికే Honor V20ను...

హువాయి సబ్ బ్రాండ్ హానర్ కూడా ఇప్ప‌టికే Honor V20ను 48 మెగాపిక్స‌ల్ కెమెరాతో గ‌త వారం చైనా మార్కెట్లో విడుద‌ల చేసింది. దీంతో ఈ ఫోన్‌కు,షియోమి విడుద‌ల చేయ‌బోయే ఫోన్‌కు మ‌ధ్య గట్టి పోటీ ఉంటుందని టెక్ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

Honor V20 ఫీచ‌ర్లు...
 

Honor V20 ఫీచ‌ర్లు...

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Xiaomi Makes Redmi a Sub-Brand, 48-Megapixel Redmi Phone Launch Set for January 10.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X