Xiaomi Mi 10: మొట్టమొదటి 108MP కెమెరా షియోమి ఫోన్ ఎలా ఉందొ చూడండి!!

|

స్మార్ట్‌ఫోన్‌ల రంగంలో తనకంటూ ప్రత్యేక రేంజ్ ను సంపాదించుకున్న షియోమి సంస్థ కొత్త కొత్త ఫోన్లతో తన వైపు అందరిని ఆకట్టుకుంటున్నది. ఇప్పుడు కూడా షియోమి మరొక Mi10 కొత్త లాంచ్ తో అందరి ముందుకు వచ్చింది. చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటి 108MP కెమెరా గల Mi 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి

షియోమి సంస్థ ఇంతకు ముందు గల తన Mi 9 స్మార్ట్‌ఫోన్‌కు అప్ డేట్ వెర్షన్ గా Mi 10ను లాంచ్ చేసింది. సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లలో Mi 10 ఫోన్ 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు వై-ఫై 6 కి మద్దతు ఇస్తుంది. ఇది 5G కనెక్టివిటీ ఎంపికతో పాటుగా ఇప్పుడు మార్కెట్ లో అత్యుత్తమంగా ఉన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో వస్తుంది.

 

 

DTH/కేబుల్ టివి రంగంలోని కొత్త మార్పులు ఇవే....DTH/కేబుల్ టివి రంగంలోని కొత్త మార్పులు ఇవే....

ధరల వివరాలు

ధరల వివరాలు

షియోమి Mi 10 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర CNY 3999 నుండి మొదలవుతుంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.40,910. ఈ ధర 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. Mi 10 మొత్తంగా మూడు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ మోడల్ యొక్క ధర CNY 4,299 (43,980 రూపాయలు) కాగా 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ యొక్క ధర CNY 4,699 (సుమారు రూ. 48,080).

 

 

Samsung Galaxy S20 5G Series, Galaxy Z Flip : మొదలైన ప్రీ-రిజిస్ట్రేషన్లుSamsung Galaxy S20 5G Series, Galaxy Z Flip : మొదలైన ప్రీ-రిజిస్ట్రేషన్లు

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

షియోమి యొక్క సరికొత్త Mi 10 స్మార్ట్‌ఫోన్‌ 1,120 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ యొక్క ముందు భాగంలో సింగిల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌తో వస్తుంది. Mi 10 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ నమూనా రేటుకు మద్దతు ఇస్తుంది. కొత్తగా ప్రారంభించిన Mi10 యొక్క డిస్ప్లే 5000000: 1 యొక్క కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది.

 

 

Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌

షియోమి Mi 10 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,780mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. Mi 10 30W వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్ మరియు 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది హోమ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల యాక్సిస్ కోసం తాజా వై-ఫై 6 మద్దతుతో వస్తుంది. ఇది Wi-Fi 802.11ac యొక్క Wi-Fi 5 అప్‌గ్రేడ్ వెర్షన్ అని కూడా పిలుస్తారు.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఫోటోగ్రఫీ విషయానికొస్తే షియోమి Mi 10 ఫోన్ యొక్క వెనుకవైపు మొత్తంగా నాలుగు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంటుంది. కొత్తగా ప్రారంభించిన షియోమి Mi 10 స్మార్ట్‌ఫోన్‌ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది శామ్సంగ్ నుండి ఐసోసెల్ బ్రైట్ HMX సెన్సార్‌ను ఉపయోగించబడి వస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లోని మిగిలిన మూడు కెమెరాలలో వరుసగా 13 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, OIS , EIS వంటి మద్దతులు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ప్యాక్ చేయబడి వస్తుంది. Mi 10 యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G , వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS, హై-రెస్ ఆడియో, ఎన్‌ఎఫ్‌సి మరియు ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 10 Launched With world's First 108 MP Camera: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X