జియోమీ ఎమ్ఐ 3 మెరుపు సేల్: అందుబాటులో 15,000 యూనిట్లు

|
జియోమీ ఎమ్ఐ 3 మెరుపు సేల్: అందుబాటులో 15,000 యూనిట్లు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ (Xiaomi) ఇటీవల భారత్‌లో తన ఉత్పత్తులను విడదుల చేసిన విషయం తెలిసిందే. జియోమీ ఎమ్ఐ 3, రెడ్ ఎమ్ఐ 1ఎస్, రెడ్ ఎమ్ఐ నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. వీటిలో జియోమీ ఎమ్ఐ 5 స్మార్ట్ ఫోన్ మోడల్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతులగా జరిగిన అమ్మకాల్లో 20,000 జియోమీ ఎమ్ఐ 3 యూనిట్‌లను ఫ్లిప్‌కార్ట్ విక్రయించినట్లు సమాచారం. 3వ విడత సేల్‌లో భాగంగా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 15,000 జియోమీ ఎమ్ఐ 3 యూనిట్ లను మంగళవారం నుంచి ఫ్లిప్‌కార్ట్ వద్ద అందుబాటులో ఉంచినట్లు జియోమీ తెలిపింది. మార్కెట్లో 16జీబి వర్షన్ జియోనీ ఎంఐ3 ఫోన్ ధర రూ.13,999.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

జియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

జియోమీ ఎంఐ3 విశ్లేషణాత్మక రివ్యూ

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/lph7zRTr1Y0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Xiaomi Mi 3 Flash Sale: 15,000 Units Available to Buy on Flipkart Today

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X