మార్కెట్లో జియోమీ ఎమ్ఐ 3@ రూ.13,999

|
మార్కెట్లో జియోమీ ఎమ్ఐ 3@ రూ.13,999

చైనాలో 5 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ (Xiaomi) తన సరికొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జియోమీ ఎమ్ఐ3, రెడ్ ఎమ్ఐ 1ఎస్, రెడ్ ఎమ్ఐ నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో జియోమీ కంపెనీ సీఈఓ లిన్ బిన్, వైస్ ప్రెసిడెంట్ హుగో బర్రా, జియోమీ ఇండియా ఆపరేషన్ హెడ్ మను కుమార్ జైన్ తదితర పాల్గొన్నారు. మార్కెట్లో 16జీబి వర్షన్ జియోనీ ఎంఐ3 ఫోన్ ధర రూ.13,999. ప్రస్తుతం ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీఆర్డర్ పై లభ్యమవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

జియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

జియోమీ ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని గిజ్‌బాట్ మరికాసేపట్లో మీముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X