జియోమీ ఎమ్ఐ3 ఫోన్‌లకు భారీ డిమాండ్

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ జియోమీ ( Xiaomi) తాజాగా ఇండియన్ మార్కెట్లో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లలో ఒకటైన జియోమీ ఎమ్ఐ3 విక్రయాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వద్ద ప్రారంభమయ్యాయి. అమ్మకాలు ప్రారంభమైన 39 నిమిషాలకే స్టాక్ మొత్తం అయిపోవటంతో అవుట్ ఆఫ్‌ స్టాక్ బోర్డ్ పెట్టవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

 
జియోమీ ఎమ్ఐ3 ఫోన్‌లకు భారీ డిమాండ్

అమ్ముడైన యూనిట్ల సంఖ్యకు సంబంధించి వివరాలను రెండు కంపెనీలు వెల్లడించలేదు. రిజిస్టర్ చేసుకున్న వారికే జియోమీ ఎమ్ఐ3 స్మార్ట్‌ఫోన్‌లనువిక్రయిస్తోన్న నేపథ్యంలో జూలై 15 నుంచి జూలై 21 వరకు తమకు లక్ష రిజిస్ట్రేషన్‌లు అందాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. జియోమీ ఎంఐ 3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ జియోమీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.

ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు. మార్కెట్లో 16జీబి వర్షన్ జియోనీ ఎంఐ3 ఫోన్ ధర రూ.13,999.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 3 smartphone sold out in 39 mins on FlipKart. Read more in Telugu 
 Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X