రూ.1కే Redmi 4A

ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి 3 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి, Mi మూడవ వార్షికోత్సవ సేల్‌ను అనౌన్స్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జూలై 20, 21 మధ్య సేల్

ఈ సేల్ జూలై 20, 21 మధ్య mi.comలో జరుగుతుంది. ఈ రెండు రోజుల సేల్ పిరియడ్‌లో భాగంగా హిట్ మోడల్స్ అయిన Redmi 4, Redmi Note 4 స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పవర్ బ్యాంక్స్ అలానే ఇతర యాక్సెసరీస్ ప్రత్యేక డిస్కౌంట్స్ పై అందుబాటులో ఉంటాయి.

రూ.1కే రెడ్‌మి 4ఏ

ఈ సేల్‌కు మరొక ఆకర్షణ రూ.1 ఫ్లాష్‌సేల్. ఈ రెండు రోజుల సేల్ పిరియడ్‌లో భాగంగా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య రూ.1 ఫ్లాష్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్లాష్ సేల్ లో భాగంగా Redmi 4A, Wi-Fi Repeater 2, 10000mAh Mi Power Bank 2 వంటి Mi ప్రొడక్ట్స్ ను రూ.1కే సొంతం చేసుకునే వీలుంటుంది.

రూ.1 ఫ్లాష్‌సేల్‌లో పాల్గొనాలంటే..?

రూ.1 ఫ్లాష్‌సేల్‌లో పాల్గొనాలనుకునే యూజర్లు సేల్ జరిగే షియెమి ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో కావల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రమోషన్ లింక్‌‍ను తమ సోషల్ హ్యాండిల్స్‌లో షేర్ చేయవల్సి ఉంటుంది.

డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు

ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వస్తువల పై రూ.2000 వరకు Goibibo డిస్కౌంట్ అలానే ఎస్‌బిఐ క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్ యూజర్లకు 5% వరకు అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Xiaomi Mi Max 2 కూడా...

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన Xiaomi Mi Max 2 కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ జూలై 20, ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 3rd Anniversary sale in India: Re. 1 flash sale, discounts and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot