అనుకున్నట్లుగానే ఆ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది

By: Hazarath Aiah

ఊహించినట్లుగానే షియోమి తన ఎంఐ నోట్ 5 ధరను తగ్గించింది . తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన ఎంఐ నోట్ 5 ను ఇండియాలో లాంచ్ చేసిన తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ ఇండియా హెడ్ మనుజైన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ఈ ఫోన్ ధర గా 24,999 ఉండేది. తగ్గించిన ధరతో అది ఇప్పుడు రూ. 22,999 ఫ్లిప్ కార్ట్, ఎంఐ. కాంలో దొరుకుతుంది. గత రెండు సంవత్సరాలలో భారతదేశం లో తమ అమ్మకాలు 72 శాతం పెరిగాయని ప్రకటించిన తర్వాత ఈ తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇతర మొబైళ్లు వాడొద్దని జియో హెచ్చరికలు..జియోపై కంపెనీల ఫైర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

లీ మాక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లో అరంగ్రేటం చేసిన స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ Mi 5 ఫోన్‌తో కూడా వచ్చింది. క్వాడ్ 64 బిట్ చిప్‌సెట్‌తో వస్తోన్న స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ 1.8 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో స్పందిస్తుంది. అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత సమర్థవంతం చేస్తుంది.

MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

Android 6.0 Marshmallow ఆధారంగా అభివృద్ధి చేసిన MIUI 7 సాఫ్ట్‌వేర్ పై Mi 5 ఫోన్ రన్ అవుతుంది. ఈ లేటెస్ట్ యూజర్ ఇంటర్‌ఫస్ ఫోన్ పనితీరును మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది.

క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0 షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్‌లో పొందుపరిచిన క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ 80 శాతం బ్యాటరీని కేవలం 35 నిమిషాల్లో చార్జ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

మెరుగుపరచబడిన కెమెరా సెన్సార్

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

Mi 5 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన Sony IMX298 16 మెగా పిక్సల్ సెన్సార్ ఫోన్ కెమెరా విబాగాని వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యుయల్ టో్న్ ఎల్ఈడి ఫ్లాష్, 4- యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఆధునిక ఫోటోగ్రఫీ అవసరాలను తీరుస్తాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 4 మెగా పిక్సల్ సెన్సార్ ద్వారా వీడియో కాలింగ్‌‍తో పాటు సెల్పీలు చిత్రీకరించుకోవచ్చు.

మరిన్ని కలర్ వేరియంట్‌లలో

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్.. నలుపు, తెలుపు వేరియంట్‌లలోనే కాకుండా ఇతర కలర్ వేరియంట్‌లలోనూ లభ్యంకానుంది. వాటిలో ప్రధానమైనది గోల్డ్ వేరియంట్.

డ్యుయల్ సిమ్ కార్డ్ సపోర్ట్

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌తో వస్తోంది. ఈ రెండు సిమ్స్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

మరిన్ని కనెక్టువిటీ ఆప్షన్స్

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

బ్లుటూత్ 4.1, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను Mi 5 స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఫోన్‌లో పొందుపరిచిన సరికొత్త VoLTE ఫీచర్ ద్వారా యూజర్లు గరిష్టంగా 600 MBps వరకు కనెక్టువిటీ స్పీడ్‌లను అందుకోవచ్చు. 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ అందించేందుకు పలువురు టెలికామ్ ఆపరేటర్లు ఉపయోగిస్తోన్న బ్యాండ్ 40ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తోంది. ఈ రివర్సబుల్ కనెక్టర్ ద్వారా చార్జింగ్‌తో పాటు డేటాను వేగవంతంగా పొందవచ్చు.

వివిధ స్టోరేజ్ ఆప్షన్‌లలో

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్‌ను వివిధ స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచారు. వాటి వివరాలు 3జీబి ర్యామ్ - 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ర్యామ్ - 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్ - 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా పెంచుకోవచ్చు.

ఫోన్‌ ధర

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

3జీబి ర్యామ్ - 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోన్న Mi 5 ఫోన్‌ ధర రూ.24,999. తగ్గింపులో భాగంగా ఇది 22,999కే వస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Xiaomi Mi 5 price in India dropped by Rs 2,000, now available for Rs 22,999
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting