సామ్‌సంగ్‌కు పెద్ద షాక్..?

రెండు రోజుల క్రితం సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.5,000 ధర తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో గెలాక్సీ ఎస్7 ధర రూ.43,400, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.50,900గా ఉంది.

సామ్‌సంగ్‌కు పెద్ద షాక్..?

Read More : రిలయన్స్ జియో 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్‌లు ఇవే!

మరో సామ్‌సంగ్‌ను క్లోజ్‌గా వాచ్ చేస్తోన్న చైనా బ్రాండ్ షియోమీ తన Mi 5 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2,000 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో షియోమీ ఎంఐ5 మార్కెట్ ధర రూ.2,999గా ఉంది. బ్రాండ్ వాల్యూను పక్కనపెడితే ఈ రెండు ఫోన్‌లు స్పెసిఫికేషన్‌లకు సంబంధించి హోరాహోరీ వార్ నడుస్తోంది. మార్కెట్లో సంచలనం రేపుతోన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి Spec comparisonను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ

షియోమీ ఎంఐ 5 ప్రీమియమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మరోవైపు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 గ్లాస్ ఇంకా మెటల్ కాంభినేషన్‌తో కూడిన హై ప్రీమియమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తోంది. కర్వుడ్ ఎడ్జ్, కంఫర్టబుల్ హోల్డ్ గ్లాస్ మెటల్ డిజైన్ వంటి అంశాలు గెలాక్సీ ఎస్7కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గెలాక్సీ ఎస్7 అదనంగా వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఏర్పాటు చేసారు.

డిస్‌ప్లే విషయానికొస్తే..

షియోమీ ఎం5 డిస్‌ప్లే విషయానికొచ్చేసరికి 5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. మరోవైపు గెలాక్సీ ఎస్7లో 5.1 అంగుళాల క్యూహైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. గెలాక్సీ ఎస్7లో పొందుపరిచిన Always On feature నోటిఫికేషన్ లను డిస్ ప్లే పై చూపుతూ బోలెడంత బ్యాటరీని ఆదా చేస్తుంది.

ప్రాసెసింగ్ పవర్...

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో అడ్రినో 530 గ్రాఫిక్స్‌తో కూడిన శక్తివంతమైన క్వాడ్‌కోర్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌లను ఏర్పాటు చేసారు. మల్టీ టాస్కింగ్ ఈ రెండు ఫోన్‌లలో స్మూత్‌గా ఉంటుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

గెలాక్సీ ఎస్7 స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 32జీబి, 64జీబి స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రెండు వేరియంట్స్ 4జీబి ర్యామ్ తో వస్తున్నాయి. మరోవైపు షియోమీ ఎంఐ 5.. 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 3జీబి ర్యామ్ వేరియంట్ 32జీబి, 64జీబి మెమరీ ఆప్షన్ లతో వస్తుండగా, 4జీబి ర్యామ్ వేరియంట్ 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

షియోమీ ఎంఐ 5 కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఏర్పాటు చేసారు. సోనీ ఐఎమ్ఎక్స్298 సెన్సార్‌తో అభివృద్థి చేయబడిన ఈ కెమెరాలో షార్పర్ ఇమెజెస్ కోసం 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వ్యవస్థను పొందుపరిచారు. 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది. మరోవైపు గెలాక్సీ ఎస్7.. 12 మెగా పిక్సల్ రేర్ ఫిసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

సాఫ్ట్‌వేర్ విషయానికొచ్చేసరికి

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై షియోమీ ఎంఐ 5 రన్ అవుతుంది. మరోవైపు గెలాక్సీ ఎస్7 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన టచ్ విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

బ్యాటరీ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లలో అధునాత ఫీచర్లతో కూడిన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థలను మనం చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 5 vs Samsung Galaxy S7: Premium Flagships Fight Hard on Price Cuts. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot