Home
Mobile

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

By Sivanjaneyulu

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016 వేదికగా ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ (Xiaomi) తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Mi 5ను లాంచ్ చేసింది. Mi 4 స్మార్ట్‌ఫోన్ విడుదలైన 18 నెలల తరువాత ఈ అనౌన్స్‌మెంట్ రావటం విశేషం. మిడ్ - రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పెక్స్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.21,000.

 అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

Mi 5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.15 అంగుళాల పూర్తి హడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ విషయానికొస్తే ఈ ఫోన్ 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలానే ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే 32 జీబి ఇంకా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను పొందవచ్చు.

Read More : ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి

Xiaomi Mi 5 ఫోన్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

లీ మాక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లో అరంగ్రేటం చేసిన స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ ఈ సారి తన అదృష్టాన్ని Mi 5 ఫోన్‌తో పరీక్షించుకోబోతోంది. క్వాడ్ 64 బిట్ చిప్‌సెట్‌తో వస్తోన్న స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ 1.8 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో స్పందిస్తుంది. 

అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత సమర్థవంతం చేస్తుంది.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

Android 6.0 Marshmallow ఆధారంగా అభివృద్ధి చేసిన MIUI 7 సాఫ్ట్‌వేర్ పై Mi 5 ఫోన్ రన్ అవుతుంది. ఈ లేటెస్ట్ యూజర్ ఇంటర్‌ఫస్ ఫోన్ పనితీరును మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫోన్‌లో పొందుపరిచిన క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ 80 శాతం బ్యాటరీని కేవలం 35 నిమిషాల్లో చార్జ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

Mi 5 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన Sony IMX298 16 మెగా పిక్సల్ సెన్సార్ ఫోన్ కెమెరా విబాగాని వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యుయల్ టో్న్ ఎల్ఈడి ఫ్లాష్, 4- యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఆధునిక ఫోటోగ్రఫీ అవసరాలను తీరుస్తాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 4 మెగా పిక్సల్ సెన్సార్ ద్వారా వీడియో కాలింగ్‌‍తో పాటు సెల్పీలు చిత్రీకరించుకోవచ్చు.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్.. నలుపు, తెలుపు వేరియంట్‌లలోనే కాకుండా ఇతర కలర్ వేరియంట్‌లలోనూ లభ్యంకానుంది. వాటిలో ప్రధానమైనది గోల్డ్ వేరియంట్.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌తో వస్తోంది. ఈ రెండు సిమ్స్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

బ్లుటూత్ 4.1, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను Mi 5 స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఫోన్‌లో పొందుపరిచిన సరికొత్త VoLTE ఫీచర్ ద్వారా యూజర్లు గరిష్టంగా 600 MBps వరకు కనెక్టువిటీ స్పీడ్‌లను అందుకోవచ్చు. 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ అందించేందుకు పలువురు టెలికామ్ ఆపరేటర్లు ఉపయోగిస్తోన్న బ్యాండ్ 40ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తోంది. ఈ రివర్సబుల్ కనెక్టర్ ద్వారా చార్జింగ్‌తో పాటు డేటాను వేగవంతంగా పొందవచ్చు.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

షియోమీ Mi 5 స్మార్ట్‌ఫోన్‌ను వివిధ స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచారు. వాటి వివరాలు 3జీబి ర్యామ్ - 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ర్యామ్ - 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్ - 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా పెంచుకోవచ్చు.

 

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

అదిరే స్పెక్స్‌తో ‘Xiaomi Mi 5’

3జీబి ర్యామ్ - 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోన్న Mi 5 ఫోన్‌ ధర రూ.21,000. 3జీబి ర్యామ్ - 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోన్న Mi 5 ఫోన్‌ ధర రూ.24,000. 4జీబి ర్యామ్ - 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోన్న Mi 5 ఫోన్‌ ధర రూ.28,000.

ఈ ఫోన్‌లకు సంబంధించిన సేల్ మరికొద్ది వారాల్లో చైనాలో ప్రారంభమవుతుంది. తరువాత ఇతర దేశాల్లో ప్రారంభమవుతుంది. ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi 5: The Samsung Galaxy S7 of the mid-range market is now official! 10 Things to Know!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X