సెప్టంబర్ 5న ఇండియాకు Mi 5X, మొదటి డ్యుయల్ కెమెరా ఫోన్

Xiaomi మొట్టమొదటి డ్యుయుల్ కెమెరా ఫోన్ Mi 5X మరికొద్ది రోజుల్లో ఇండియాకు రాబోతోంది. సెప్టంబర్ 5న నిర్వహించే స్పెషల్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా షియోమి తన Mi 5X స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ యూజర్లకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Read More : ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వర్షన్‌లో...

Mi 5X ఫోన్‌ను కొద్ది రోజుల క్రితమే చైనా మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది. 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వర్షన్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర చైనా మార్కెట్లో CNY 1,499గా ఉంది. మన కరెన్సీలో ఈ విలువ రూ.14,200. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంతుంటందనేది తెలియాల్సి ఉంది.

డ్యుయల్ కెమెరా సెటప్...

Mi 5X ఫోన్‌కు ప్రధాన హైలైట్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు 12 మెగా పిక్సల్ కెమెరాలను అమర్చటం జరిగింది. వీటిలో ఒకటి టెలీఫోటో జూమింగ్ కోసం పనిచేస్తే మరొకటి వైడ్ యాంగిల్ షాట్స్ కోసం పనిచేస్తుంది. వైడ్-యాంగిల్ లెన్స్‌ను క్యాప్చుర్ చేసే సెన్సార్ f/2.2 apertureతో వస్తుంది. టెలీఫోటో జూమ్ లెన్స్‌తో వచ్చే సెన్సార్ f/2.6 apertureతో వస్తుంది. ఫోన్ ముందుగా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

Xiaomi Mi 5X స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Xiaomi Mi 5X స్పెసిఫికేషన్స్..

12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, డీహెచ్ఎస్ ఆడియో క్యాలిబ్రేషన్ అల్గారిథమ్, 3080mAh బ్యాటరీ, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ కర్వుడ్ ఎడ్జెస్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 5X India Launch Expected at September 5 Event. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot