Mi 5X vs Moto G5s Plus, తదుపరి పోరు వీటి మధ్యనే..?

ఈ రెండూ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న ఫోన్‌లే కావటంతో స్పెసిఫికేషన్స్ అలానే ధర అంశాల పై మార్కెట్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

|

మోటరోలా, షియోమీల మధ్య మరోసారి పోటీ వాతావరణం నెలకుంది. షియోమీ నుంచి కొద్ది రోజుల క్రితం చైనా మార్కెట్లో లాంచ్ అయిన Mi 5X వచ్చే నెలలో భారత్‌కు రాబోతోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మోటరోలా అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ Moto G5s Plus కూడా భారత్‌లో లాంచ్ కాబోతోంది. ఈ రెండూ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న ఫోన్‌లే కావటంతో స్పెసిఫికేషన్స్ అలానే ధర అంశాల పై మార్కెట్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే నెల రోజుల్లో మార్కెట్లో సందిడి చేయబోతోన్న ఈ ఫోన్‌ల పై స్పెషల్ ఫోకస్...

WhatsApp Payments మొదటి లుక్ ఇదేWhatsApp Payments మొదటి లుక్ ఇదే

పూర్తి మెటల్ బాడీతో...

పూర్తి మెటల్ బాడీతో...

షియోమీ Mi 6 స్మార్ట్‌ఫోన్‌కు మినీ వర్షన్‌గా భావిస్తోన్న Mi 5X స్మార్ట్‌ఫోన్ పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ కెమెరా సెటప్ వంటి అంశాలు ఫోన్‌కు సరికొత్త లుక్‌ను తీసుకువచ్చాయి. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది(రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్).

ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో మోటో జీ5ఎస్ ప్లస్

ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో మోటో జీ5ఎస్ ప్లస్

మోటో జీ5 ప్లస్‌కు సక్సెసర్ వర్షన్‌గా వస్తోన్న Moto G5s Plus స్మార్ట్‌ఫోన్ కూడా పూర్తి మెటల్ బాడీని కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ముందు భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. డ్యుయల్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్. మోటో లైనప్ నుంచి వస్తున్న మొట్టమొదటి డ్యుయల్ కెమెరా ఫోన్ కూడా ఇదే కావటం విశేషం. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి మోటో జీ5ఎస్ ప్లస్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది.

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే

 మోటో జీ5ఎస్ ప్లస్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 3జీబి, 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 32జీబి, 64జీబి వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై

ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై

మోటో జీ5ఎస్ ప్లస్ తరహాలోనే షియోమీ Mi 5X కూడా ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే

సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే

ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. Wi-Fi, NFC, Bluetooth, GPS/A-GPS, 4G LTE వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. షియోమీ నుంచి వస్తోన్న Mi 5X ఫోన్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి

మోటో జీ5ఎస్ ప్లస్ వెనుక భాగంలో డ్యుయల్ రేర్ కెమెరా సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్స్ 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ద్వారా సెల్ఫీ అలానే వీడియో కాల్స్ చిత్రీకరించుకోవచ్చు.

 Mi 5X ఫోన్‌లోనూ  డ్యుయల్ కెమెరా సెటప్

Mi 5X ఫోన్‌లోనూ డ్యుయల్ కెమెరా సెటప్

మోటో జీ5ఎస్ ప్లస్ తరహాలోనే Mi 5X ఫోన్‌లో కూడా డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు 12 మెగా పిక్సల్ కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి టెలీఫోటో జూమింగ్ కోసం పనిచేస్తే మరొకటి వైడ్ యాంగిల్ షాట్స్ కోసం పనిచేస్తుంది. వైడ్-యాంగిల్ లెన్స్‌ను క్యాప్చుర్ చేసే సెన్సార్ f/2.2 apertureతో వస్తుంది. టెలీఫోటో జూమ్ లెన్స్‌తో వచ్చే సెన్సార్ f/2.6 apertureతో వస్తుంది. ఫోన్ ముందుగా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

ఎంఐ 5ఎక్స్ ఫోన్ 3,080mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇదేసమయంలో
మోటో జీ5ఎస్ ప్లస్ 3,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. టర్బో ఛార్జింగ్ టెక్నాలజీని ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది.

ధరలు విషయానికి వచ్చేసరికి

ధరలు విషయానికి వచ్చేసరికి

ఇండియన్ మార్కెట్లో మోటో జీ5ఎస్ ప్లస్ ధర రూ.20,000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో Mi 5X ధర రూ.14,999గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. స్సెసిఫికేషన్స్ పరంగా హోరాహోరీగా తలపడుతోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏది విజేతగా నిలుస్తుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడవుతుంది.

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi 5X vs Motorola Moto G5s Plus: Which is the best Upcoming Smartphone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X