అదిరే ఫీచర్లతో షియోమి ఎంఐ 6ఎక్స్, పేరు మార్చుకుని ఇండియాకు ..

Written By:

గత కొద్ది రోజుల నుంచి మార్కెట్లో చక్కర్లు కొడుతున్న షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ 6ఎక్స్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. యుహాన్‌ యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్‌లో సీఈవో లీ జున్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేశారు. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది.ఇదే డిజైన్‌, కెమెరాలో ఏఐ ఇంటిగ్రేషన్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియా ఆధారిత కస్టమ్‌ స్కిన్‌లతో ఎంఐ ఏ2గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని షియోమి భావిస్తోంది. కాగా ఎంఐ ఏ2 లాంచ్‌ చేయనున్న సందర్భంగా ఇప్పటికే భారత్‌లో ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది.

అదిరే ఫీచర్లతో షియోమి ఎంఐ 6ఎక్స్, పేరు మార్చుకుని ఇండియాకు ..

ఎంఐ 6 ఎక్స్‌(ఎంఐ ఏ2) ధర
మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఒకటి 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌, ధర 1,599 సీఎన్‌వై(సుమారు రూ.16,900). రెండోది 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, ధర 1,799 సీఎన్‌వై(సుమారు రూ.19,000). టాప్‌ ఎండ్‌ ఎంఐ 6ఎక్స్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంది, ధర 1,999 సీఎన్‌వై(సుమారు రూ.21వేలు). ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి చైనాలో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

56 రోజుల పాటు జియో 112 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండి

షియోమీ ఎంఐ 6ఎక్స్ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఎంఐయూఐ 9.5 సాఫ్ట్‌వేర్‌, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్‌ అన్‌లాక్‌ ఫంక్షన్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0. రెడ్‌, గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో అందుబాటు.

English summary
Xiaomi Mi 6X (Mi A2) With Dual Rear Cameras, AI Integration Launched: Price, Specifications, Release Date more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot