ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు సవాల్ విసరనున్న షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌

Written By:

షియోమి..ఈ పేరు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఓ సంచలనం. ఈ చైనా దిగ్గజం ప్రతి సెగ్మెంట్‌లోనూ దిగ్గజ కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతోంది.చిన్న ఫోన్ల మార్కెట్లో షియోమి ఎదురులేకుండా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..అయితే ఫ్లాగ్‌షిప్‌ల మార్కెట్లో తన సత్తాను చాటలేక చతికిలపడుతోంది. ఇప్పుడు ఆ మార్కెట్లో కూడా సత్తా చాటడానికి సరికొత్త వ్యూహంతో దూసుకొస్తోంది.

మీరు టాటా కస్టమర్లా..అయితే ఎయిర్‌టెల్‌లోకి మారండిక..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్‌, హువాయ్‌, ఆపిల్, శాంసంగ్ లాంటి కంపెనీల నుంచి

భారత్‌లో హైఎండ్‌ వేరియంట్ల విషయంలో వన్‌ప్లస్‌, హువాయ్‌, ఆపిల్, శాంసంగ్ లాంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఉండటంతో ఈ చైనా దిగ్గజం ఫ్లాగ్‌షిప్‌ మార్కెట్లో తన సత్తాను చాటలేక పోతోంది. ఇందులో భాగంగా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లపై దృష్టి సారించింది.

షియోమి ఎంఐ 7 పేరుతో

షియోమి ఎంఐ 7 పేరుతో వచ్చే ఏడాది ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతుంది. బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో ఇది రూపొందుతుంట. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, వన్‌ప్లస్‌ 5టీకి గట్టిపోటీ ఇవ్వగలదని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో..

మైడ్రైవర్స్‌ రిపోర్టు ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తారని, క్వాల్‌కామ్‌ అప్‌కమింగ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 చిప్‌సెట్‌తో రూపొందుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6.01 అంగుళాల ఓలెడ్‌ డిస్‌ప్లే కూడా ఉంటుందట.

ఫీచర్లు

6జీబీ ర్యామ్‌, 16ఎంపీ సెన్సార్లతో వెనుకవైపు రెండు డ్యూయల్‌ కెమెరాలు, తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోగ్రఫీ, 3350 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ దీనిలో ఫీచర్లుగా ఉండబోతున్నాయని మైడ్రైవర్స్‌ రిపోర్టు చేసింది.

సుమారు ధర రూ.26,600

రిపోర్టు ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.26,600గా ఉండబోతుందని అంచనా. దేశీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌ కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి షావోమికి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో సహకరిస్తుందని టెక్‌ వర్గాలంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 7 to launch with Snapdragon 845, bezel-less screen, dual camera: Report Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot