డిస్‌ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో Mi 7..

Vivo X20 UD డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ గా విపణి లో నిలిచింది. దీనిని అనుసరించి Vivo APEX కాన్సెప్ట్ ఫోన్ మరియు X20 కి సక్సెసర్ గా Vivo X21ను కూడా ప్రవేశపెట్టింది

|

Vivo X20 UD డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ గా విపణి లో నిలిచింది. దీనిని అనుసరించి Vivo APEX కాన్సెప్ట్ ఫోన్ మరియు X20 కి సక్సెసర్ గా Vivo X21 ను కూడా ప్రవేశపెట్టింది. Vivo తర్వాత Huawei తన Mate RS Porsche design ను ఇదే ఫీచర్ తో డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ ఉండేలా ప్రవేశపెట్టింది. ఇప్పుడు Xiomi వంతు ఈ Mi7 కానుంది. Xiomi CEO Lei Jun weibo లో తమ అధికారిక అకౌంట్ నందు Xiomi ఫాన్స్ తో Mi7 డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నట్లు తెలిపారు. ఈమద్యనే Xiomi తన Mi Mix2S ఫోటోలను weibo లో తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనతికాలంలోనే Mi7 గురించిన విషయం కూడా పోస్ట్ చేయడం జరిగినది. దీనిని Jun కూడా ధృవీకరించారు.

Mi 7

ఈమద్యనే , త్వరలో ఈ Mi7 మరియు Mi 7 plus ఫ్లాగ్ షిప్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేయడం కూడా జరిగినది. లీక్ కాబడిన firmware ఫైల్స్ దృష్ట్యా, Mi7 ఫైల్స్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఎటువంటి లైట్ ను కలిగి ఉండవు. అందిన సమాచారం మేరకు డిప్పర్ అనే కోడ్ నేమ్ కలిగి, Mi7 నాచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 845 soc ప్రాసెసర్ , నవీకరించబడిన ఫేషియల్ రికగ్నిషన్ , AI(artificial intelligence ) తో కూడుకున్న 16 MP డ్యూయల్ రేర్ కేమరా , 3400 mah బాటరీ, wireless charging support తో ప్రత్యేకంగా రానుంది.

Apple AirPodsలో సాధారణ సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా..?Apple AirPodsలో సాధారణ సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా..?

లీక్ అయిన ఫర్మ్ వేర్ ఫైల్స్ ద్వారా Mi 7 ప్లస్ , Ursa అనే కోడ్ నేమ్ కలిగి, డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు Mi7 ప్లస్ నవీకరించబడిన ఫేషియల్ రికగ్నిషన్ (mi7 కు కాస్త భిన్నంగా) తో రానున్నది. లీక్ అయిన స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే ,ఈ Mi7 ప్లస్ OLED డిస్ప్లే తో, స్నాప్ డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ తో, 4000 mah బాటరీ తో రానున్నదని తెలుస్తుంది. Xiomi ఈ Mi7, Mi7 plus లను ఈ సంవత్సరం జూన్ లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. Mix 2s విషయంలో కూడా ఒక నెల పాటు వినియోగదారులను అనేకరకాలుగా ఆటపట్టించి విడుదల చేసినట్లు, అదే ఆలోచనను ఈ Mi7, Mi7 plus విషయం లో కూడా పాటించవచ్చని విమర్శకుల అభిప్రాయం.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 7 under-display fingerprint sensor confirmed by CEO More news at Gibzot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X