లీకయిన Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, 8జిబి ర్యామ్‌, ఇంకా అదిరే ఫీచర్లతో..

By Hazarath
|

చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమి రానున్న నెలల్లో రెండు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎంఐ మిక్స్‌ 2ఎస్‌, ఎంఐ 7 పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తుందనే రిపోర్టులు బయటకు వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్లు అలాగే ముఖ్యమైన ఫీచర్లు బయటికి వచ్చాయి. మరి బయటకు వచ్చిన ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

 

ప్రేమికుల రోజున గిప్ట్ ఇవ్వాలా, అయితే ఆఫర్‌తో వన్‌ప్లస్ 5టీ రెడీ !ప్రేమికుల రోజున గిప్ట్ ఇవ్వాలా, అయితే ఆఫర్‌తో వన్‌ప్లస్ 5టీ రెడీ !

లీకయిన షియోమి ఎంఐ 7 ఫీచర్లు

లీకయిన షియోమి ఎంఐ 7 ఫీచర్లు

5.65 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే కాగా ఇది ఇంతకుముందు 6 అంగుళాల డిస్‌ప్లేతో రానుందని వార్తలు వెలువడ్డాయి.
2160 x 1080 pixels రిజల్యూషన్
స్నాప్‌డ్రాగన్‌ 845 చిప్‌సెట్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
16 మెగాపిక్సెల్‌ లెన్సెస్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ సింగిల్‌ సెన్సార్‌ సెల్పీ కెమెరా
4480 ఎంఏహెచ్‌ బ్యాటరీ, wireless charging
Android Nougat or Android Oreo
MIUI 8.1.30x version
ఏప్రిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ఎంఐ మిక్స్‌ 2ఎస్‌

ఎంఐ మిక్స్‌ 2ఎస్‌

కాగా ఈ నెల చివరిలో జరగబోయే ఎండబ్ల్యూఐసీ 2018లో ఎంఐ మిక్స్‌ 2ఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని టెక్ విశ్లేషకులు సైతం ధృవీరకరిస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన లీకేజీల్లో వివో కొత్తగా తీసుకొచ్చే ఎక్స్‌ప్లే7 స్మార్ట్‌ఫోన్‌ 10జీబీ ర్యామ్‌ను కలిగి ఉండనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

షియోమీ ఎంఐ6 ఫీచర్లు
 

షియోమీ ఎంఐ6 ఫీచర్లు

కాగా ఎంఐ6ను గతేడాది రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది 6జిబి ర్యామ్ తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. దీన్ని అప్ గ్రేడ్ వర్సన్ ఇస్తూ ఎంఐ7ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
షియోమీ ఎంఐ6 ఫీచర్లు
5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్
12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు

ఇప్పుడు మార్కెట్లో షియోమి హైఎండ్ స్మార్ట్ ఫోన్ ఎంఐ మిక్స్2 అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ సేల్ కొచ్చినప్పుడల్లా క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే 2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ 6జీబీ/8జీబీ ర్యామ్‌ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 12 ఎంపీ రియర్‌ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 స్కీన్ షాట్

స్కీన్ షాట్

షియోమి నుంచి సోషల్ మీడియాలో లీకయిన స్కీన్ షాట్ ఫోటో ఇదే..ఇది చైనా భాషలో ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi7 Leaked Specs Point Towards an 8GB RAM Model and Ample Storage Options More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X