సెప్టెంబర్ లో ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న షియోమి Mi 8 , కొత్త ఫీచర్లు ఇవే

షియోమి Mi 8 ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. సెప్టెంబర్ నెలలో ఈ Mi 8 స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు.

By Anil
|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఒక రోజు క్రితం పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్ Poco F1 ఇండియా మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మరో స్మార్ట్‌ఫోన్ షియోమి Mi 8 ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. సెప్టెంబర్ నెలలో ఈ Mi 8 స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. షియోమి నుంచి రాబోయే తొలి నోచ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ అవ్వడం ఒక విశేషం.ఈ ఫోన్ ధర సుమారు రూ.30,000 ఉండవచ్చు అని అంచన.

ఆన్ లైన్ గేమ్ లపై మోజు ,మోమో గేమ్ కు 12 ఏళ్ళ అమ్మాయి బలిఆన్ లైన్ గేమ్ లపై మోజు ,మోమో గేమ్ కు 12 ఏళ్ళ అమ్మాయి బలి

షియోమి Mi 8 ఫీచర్లు....

షియోమి Mi 8 ఫీచర్లు....

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌....

3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌....

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన 3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, చీకటి వాతావరణంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేయనుంది.బ్లూ, గోల్డ్‌, లైట్‌ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానున్నాయి.

ఐఫోన్ X తరహాలో....

ఐఫోన్ X తరహాలో....

ఐఫోన్ X తరహాలో పనిచేస్తుంది. యూజర్ ముఖాన్ని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో 3డీ ఇమేజ్‌గా రూపొందించుకుంటుంది. యూజర్ ముఖాన్ని స్కాన్ చేశాక అందులో 4096 ఫేషియల్ పాయింట్స్‌ను ఈ సెన్సార్ గుర్తించి స్టోర్ చేసుకుంటుంది.

వచ్చే నెల సెప్టెంబర్ లో లాంచ్....

వచ్చే నెల సెప్టెంబర్ లో లాంచ్....

ఈ ఫోన్ వేరియెంట్లు అన్నీ వచ్చే నెల సెప్టెంబర్ నుంచి ఇండియా మార్కెట్లో లభిస్తాయి.ఈ షియోమి Mi 8 ఫోన్ ధర సుమారు రూ.30,000 ఉండవచ్చు అని అంచన.

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi 8 India launch expected in September, could cost around Rs 30,000.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X