షియోమి నుంచి మునుపెన్నడూ లేని ఫీచర్లతో ఎంఐ 8ప్రొ

|

చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వైపు మొగ్గు చూపింది.చైనా కంపెనీలు ఒప్పో, వివో స్మార్ట్‌ఫోన్ల తరహాలోనే ఐఆర్ ఫేస్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్‌గా ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ స్క్రీన్‌, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఎంఐ 8 ఫ్యామిలీ కొనసాగింపుగా ఎంఐ 8ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది.

 

రూ. 3999కే షట్టర్‌ప్రూఫ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్రూ. 3999కే షట్టర్‌ప్రూఫ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్

ఎంఐ 8ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ధరను..

ఎంఐ 8ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ధరను..

ఎంఐ 8ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ధరను కంపెనీ రూ.33,945గా నిర్ణయించింది. అలాగే హై ఎండ్‌ వేరియంట్‌ ధర 38,000 రూపాయలుగా ఉండనుంది. ఈ ఫోన్లతో పాటు ఎంఐ 8 లైట్‌ను యూత్‌ ఎడిషన్‌ కూడా విడుదల చేసింది.

షియోమీ ఎంఐ 8 ప్రొ ఫీచర్లు

షియోమీ ఎంఐ 8 ప్రొ ఫీచర్లు

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, ఫాస్ట్ చార్జింగ్.

డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
 

డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

ఎంఐ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు వివో ఫోన్లలో ఈ ఫీచర్ లభిస్తుండగా ఆ జాబితాలోకి షియోమీ కూడా వచ్చి చేరింది. ఇక ఈ ఫోన్‌లో 6.21 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినందున ఈ ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.

వెనుక భాగంలో 12 mpతో రెండు కెమెరాలు

వెనుక భాగంలో 12 mpతో రెండు కెమెరాలు

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ కూడా ఈఫోన్‌లో ఉంది.

 షియోమీ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్ ఫీచర్లు

షియోమీ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్ ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే..

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే..

షియోమీ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు.

ధర

ధర

ఎంఐ8 లైట్‌ యూత్ ఎడిషన్ 4జీబీ /64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు 15వేలు, అలాగే 6జీబీ/64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 18,000. అలాగే 6జీబీ /128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. సుమారు 21, 000గా ఉండనుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Mi 8 gets in-display fingerprint scanner variant, dual-gradient back treatment more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X