షియోమి తొలి నోచ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, అబ్బురపరిచే ఫీచర్లతో Mi 8

గత కొద్ది కాలం నుంచి మార్కెట్లో అనేక రూమర్లతో హల్ చల్ చేసిన షియోమి ఎట్టకేలకు ఆ రూమర్లను నిజం చేసింది.

|

గత కొద్ది కాలం నుంచి మార్కెట్లో అనేక రూమర్లతో హల్ చల్ చేసిన షియోమి ఎట్టకేలకు ఆ రూమర్లను నిజం చేసింది. చైనాలోని Shenzenలో 8వ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకలో కంపెనీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ 8ను లాంచ్ చేసింది. దీంతో పాటు ఎంఐ 8 ఎస్‌ఈ, 75 అంగుళాల ఎంఐ టీవీ 4, ఎంఐ వీఆర్‌ స్టాండలోన్‌, ఎంఐ బ్యాండ్‌ 3, ఎంఐ 8 ఎక్స్‌ప్లోర్‌ లను కూడా విడుదల చేసింది. కంపెనీ సీఈవో లీ జున్‌ వీటిని చైనా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. వీటి ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

రాందేవ్ బాబా కింభో యాప్ చాలా డేంజర్,హెచ్చరిస్తున్న నిపుణులు !రాందేవ్ బాబా కింభో యాప్ చాలా డేంజర్,హెచ్చరిస్తున్న నిపుణులు !

షియోమీ ఎంఐ8 ఫీచర్లు

షియోమీ ఎంఐ8 ఫీచర్లు

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ఫీచర్లు

ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ఫీచర్లు

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధరలు

ధరలు

6జీబీ ర్యామ్‌, 64 జీబీ వెర్షన్‌ ధర 2,699 సీఎన్‌వై(సుమారు రూ.28,600)
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ వెర్షన్‌ ధర 2,999 సీఎన్‌వై(సుమారు రూ.31,600)
6 జీబీ ర్యామ్‌, 256 జీబీ వెర్షన్‌ ధర 3,299 సీఎన్‌వై(సుమారు రూ.34,800)
8 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఎక్స్‌ప్లోర్‌ ఎడిషన్‌ ధర 3,799 సీఎన్‌వై(సుమారు రూ.39,000) గా ఉంది

3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌

3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన 3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, చీకటి వాతావరణంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేయనుంది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌తో పాటు, ఎంఐ 8 ఎస్‌ఈ, 75 అంగుళాల ఎంఐ టీవీ 4, ఎంఐ వీఆర్‌ స్టాండలోన్‌, ఎంఐ బ్యాండ్‌ 3ను కూడా లాంచ్‌ చేసినట్టు కంపెనీ తెలిపింది. బ్లూ, గోల్డ్‌, లైట్‌ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానున్నాయి.

ఐఫోన్ X తరహాలో

ఐఫోన్ X తరహాలో

ఐఫోన్ X తరహాలో పనిచేస్తుంది. యూజర్ ముఖాన్ని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో 3డీ ఇమేజ్‌గా రూపొందించుకుంటుంది. యూజర్ ముఖాన్ని స్కాన్ చేశాక అందులో 4096 ఫేషియల్ పాయింట్స్‌ను ఈ సెన్సార్ గుర్తించి స్టోర్ చేసుకుంటుంది.

ముఖంతోనే అన్‌లాక్

ముఖంతోనే అన్‌లాక్

దీంతో యూజర్ ఫోన్‌ను తన ముఖంతోనే అన్‌లాక్ (3డీ ఫేస్ అన్‌లాక్) చేయవచ్చు. ఈ క్రమంలో ఇతరులెవరూ ఫోన్‌ను ఓపెన్ చేసేందుకు వీలుండదు. అయితే ఈ 3డీ ఫేస్ అన్‌లాక్ ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో మాత్రమే లభిస్తున్నది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్ అచ్చం ఐఫోన్ X ను పోలిన డిజైన్‌తోపాటు సరిగ్గా అలాంటి ఫీచర్లతోనే మార్కెట్లోకి వచ్చింది.

జూన్ 5 నుంచి చైనా మార్కెట్‌లో

జూన్ 5 నుంచి చైనా మార్కెట్‌లో

ఈ ఫోన్ వేరియెంట్లు అన్నీ జూన్ 5 నుంచి చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి. తరువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్లు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Xiaomi's Mi 8, Mi 8 Explorer Edition and Mi 8 SE officially launched in China More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X