ఇండియాలో ఫస్ట్ టైం షియోమి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అమ్మకాలు, ఈ ఫోన్‌తోనే..

Written By:

చైనా కంపెనీ షియోమి గత వారం ఢిల్లీలో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Xiaomi Mi A1 అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఇండియాలో తొలిసారిగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్. అలాగే మి.కామ్ ద్వారా ఈ ఫోన్ ని యూజర్లు కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు Sangeetha, Poorvika, Big C, LOT, UniverCell, E-Zone, Croma, and Vijay Sales మొదలైన స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ధర, ఫీచర్లను పరిశీలించినట్లయితే..

10 ఏళ్ల ప్రస్థానం: ఆపిల్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం, లైవ్ చూడాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo),2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్...

12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

స్టాక్ ఆండ్రాయిడ్..

డిజైన్, స్పెసిఫికేషన్స్, కెమెరా పరంగా చూస్తే షియోమి Mi A1 ఫోన్, ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ అయిన Mi 5Xను పోలి ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ డివైస్ కావటంతో స్టాక్ ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది. ఏ విధమైన అదనపు యూజర్ ఇంటర్‌ఫేస్‌లు ఉండవు. ప్యూర్ ఆండ్రాయిడ్ వర్షన్ పై ఫోన్ బూట్ అవుతుంది.

200జీబి వరకు ఉచిత ఎయిర్‌టెల్ 4జీ డేటా

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు షియోమి ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. సంగీతా, బిగ్‌సీ, లాట్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ ఈ ఫోన్‌లను విక్రయించనున్నట్లు షియోమి తెలిపింది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై 200జీబి వరకు ఉచిత ఎయిర్‌టెల్ 4జీ డేటాను యూజర్లు పొందే వీలుంటుంది.

ధర రూ.14,999.

ధర రూ.14,999. రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. బ్లాక్ అండ్ గోల్ట్ కలర్స్ లో ఈ ఫోన్ ని వినియోగదారులు పొందవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Xiaomi Mi A1 Android One smartphone to go on sale for the first time today Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting