షియోమి తొలి ఆండ్రాయిడ్ ఓరియో స్మార్ట్‌ఫోన్ Mi A1 అవుట్, Mi A2 ఇన్

దిగ్గజ మొబైల్ సంస్థ షియోమి గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన తొలి ఆండ్రాయిడ్ ఓరియో స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఏ1 విక్రయాలను నిలిపివేసింది.

|

దిగ్గజ మొబైల్ సంస్థ షియోమి గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన తొలి ఆండ్రాయిడ్ ఓరియో స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఏ1 విక్రయాలను నిలిపివేసింది. ఈ ఫోన్ వచ్చిన ఏడు నెలలకే దీని అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. గతేడాది రీలీజయిన ఈఫోన్ కి జనవరి మొదటి వారంలో ఆండ్రాయిడ్ వెర్షన్ అప్ డేట్ కూడా కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏమైందో ఏమో కంపెనీ ఈ ఫోన్ అమ్మకాలను ఆపేసింది. అతి స్వల్ప కాలంలోనే ఓ ఫోన్ విక్రయాలను షియోమీ నిలిపివేయడం ఇదే మొదటి సారి. అయితే, ఏ1 కు కొనసాగింపుగా ఎంఐ ఏ2 ఫోన్ ను కంపెనీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివర్లో ఈ ఫోన్ విడుదలకు చేయనున్నట్లు కంపెనీ సంకేతం కూడా ఇచ్చింది. కాగా ఎంఐ ఏ2 కూాడా ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోనే. ఓరియో 8.1 పై పనిచేస్తుంది.

 

కూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే రెండు 4జీస్మార్ట్‌ఫోన్లుకూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే రెండు 4జీస్మార్ట్‌ఫోన్లు

షియోమీ ఎంఐ ఎ1

షియోమీ ఎంఐ ఎ1

షియోమీ ఎంఐ ఎ1 రూ.14,999 ధరతో వినియోగదారులకు లభ్యమయింది.
షియోమీ ఎంఐ ఎ1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ ఎంఐ ఎ1 రెడ్ కలర్ వేరియంట్
 

షియోమీ ఎంఐ ఎ1 రెడ్ కలర్ వేరియంట్

దీంతో పాటు షియోమి దీనికి కలర్ వేరియంట్ ని కూడా రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెడ్ కలర్ వేరియంట్ తో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 13,999గా ఉంది.
షియోమీ ఎంఐ ఎ1 రెడ్ కలర్ వేరియంట్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Mi 6X

Mi 6X

అయితే కంపెనీ Mi A2 ఫీచర్లని చాలా గోప్యంగా ఉంచింది. దీని గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తపడుతోంది. దీంతో పాటు కంపెనీ Mi 6Xను కూడా విడుదల చేయనుంది. ఈ నెల 25వ తేదీన ఈ ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. ధర వివరాలు ఇంకా బయటకు రాలేదు.
షియోమీ ఎంఐ 6ఎక్స్ స్పెషిఫికేషన్స్ ( అంచనా)
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 2910 ఎంఏహెచ్ బ్యాటరీ.

గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్ షార్క్

గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్ షార్క్

మరో గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్ షార్క్ కూడా ఇదే ఫోన్తో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.31,160, రూ.36,375 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

షియోమీ బ్లాక్ షార్క్ స్పెషిఫికేషన్స్

షియోమీ బ్లాక్ షార్క్ స్పెషిఫికేషన్స్

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Best Mobiles in India

English summary
Xiaomi Mi A1 discontinued in India, to be replaced with Mi A2 Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X