Mi A1 లాంచ్ అయ్యింది, ధర రూ.14,999.. సెప్టంబర్ 12 నుంచి సేల్

    X

    చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి, తన సరికొత్త Mi A1 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.14,999. సెప్టంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

    Read More : ఫోన్ అంటే ఇదే...

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    ఫ్లిప్‌కార్ట్‌తో పాటు షియోమి ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యం..

    ఫ్లిప్‌కార్ట్‌తో పాటు షియోమి ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. సంగీతా, బిగ్‌సీ, లాట్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ ఈ ఫోన్‌లను విక్రయించనున్నట్లు షియోమి తెలిపింది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై 200జీబి వరకు ఉచిత ఎయిర్‌టెల్ 4జీ డేటాను యూజర్లు పొందే వీలుంటుంది.

    స్టాక్ ఆండ్రాయిడ్..

    డిజైన్, స్పెసిఫికేషన్స్, కెమెరా పరంగా చూస్తే షియోమి Mi A1 ఫోన్, ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ అయిన Mi 5Xను పోలి ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ డివైస్ కావటంతో స్టాక్ ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది. ఏ విధమైన అదనపు యూజర్ ఇంటర్‌ఫేస్‌లు ఉండవు. ప్యూర్ ఆండ్రాయిడ్ వర్షన్ పై ఫోన్ బూట్ అవుతుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

    Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్...

    5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo),2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.

    Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్...

    12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Xiaomi Mi A1 launched in India for Rs 14,999, to start selling from 12 September on Flipkart. Read More in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more